ఆర్థిక వ్యవస్థ నుంచి అంతరిక్షం వరకూ.. రక్షణ నుంచి ఎగుమతుల వరకూ అన్నింటిలోనూ భారత్ సమున్నతంగా ఎదిగే దిశగా ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఇచ్చారు. భారత ఆత్మగౌరవం విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా .. ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
అమెరికా విధిస్తున్న సుంకాల విషయంలో ఆందోళన అవసరం లేదని.. తాత్కలికంగా ఇబ్బందులు ఎదురైనా.. స్వదేశీ నైపుణ్యాలు, వనరులతో ప్రపంచానికే అవసరాలు తీర్చగల సామర్థ్యం బారత్ కు ఉందన్నారు. తక్కువ ధర – అత్యుత్తున నాణ్యతతో ప్రపంచ మార్కెట్లలోకి విస్తరించవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోతున్నందున.. మనం కూడా స్వదేశీకే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా నిలవడమన్నారు.
అలాగే భారత్ లోనూ అంతర్గతంగా ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేలా చర్యలు ప్రకటించారు. దీపావళికి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అలాగే యువతకు పలు రకాల వరాలు ప్రకటించారు. ప్రైవేటు కంపెనీల్లో చేరే ఉద్యోగులకు కేంద్రం తరపున నెలకు రూ. పదిహేను ఇచ్చే పథకాన్ని ప్రకటించారు. యువతకు ఉపాధి కోసం లక్ష కోట్లు కేటాయించిన పథకాన్నీ ప్రకటించారు.
రక్షణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సుదర్శన చక్ర అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా మోదీ తెలిపారు . శత్రుసైన్యం కాదు కదా ఎవరూ .. చివరికి సైబర్ దాడులు కూడా చేయకుండా ఈ రక్షణ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక పంపించారు. సింధూ జలాల ఒప్పందంపై ఇక చర్చలు లేదన్నారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ ఇప్పటికే తిరస్కరించింది.