కుర్ర హీరో… మ‌రో హిట్టు కొట్టాడుగా!

ఈరోజుల్లో క‌థ‌ల ఎంపిక చాలా క‌ష్ట‌మైన విష‌యం. అందులోనూ తొలి అడుగులు వేస్తున్న హీరోల‌కు. క‌థ‌ల విష‌యంలో త‌డ‌బ‌డితే, కెరీర్‌కు ఆదిలోనే పుల్ స్టాప్ ప‌డిపోతుంది. ఈ విష‌యంలో కుర్ర హీరో నార్ని నితిన్ తెలివైన దారిలోనే వెళ్తున్నాడు. ఎన్టీఆర్ బామ్మ‌ర్దిగా తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగు పెట్టాడు నార్ని నితిన్. ‘మ్యాడ్‌’ త‌న‌కు మంచి ఆరంభ‌మే ఇచ్చింది. ఈ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు ‘ఆయ్‌’ వ‌చ్చింది. ఆగ‌స్టు 15న విడుద‌లైన అన్ని సినిమాల్లోకెల్లా ‘ఆయ్‌’కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. తొలి రోజు థియేట‌ర్లు పెద్ద‌గా లేక‌పోయినా, శుక్ర‌వారం నాటికి కొత్త థియేట‌ర్లు వ‌చ్చి చేరాయి. శ‌ని, ఆదివారాలు మ‌రిన్ని థియేటర్లు పెరిగే అవ‌కాశం ఉంది.

‘మ్యాడ్’ త‌ర‌వాత నితిన్‌కు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ‘మ్యాడ్‌’ త‌ర‌వాత మాస్‌, యాక్ష‌న్ క‌థ‌లంటూ చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టాడు. కేవ‌లం క‌థ‌పై న‌మ్మ‌కంతో ‘ఆయ్‌ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. ‘ఆయ్‌’ నితిన్‌కు అన్ని విధాలా ప్ల‌స్ అయ్యింది. తొలి సినిమా కంటే న‌ట‌న‌లో, డాన్సుల్లో మ‌రింత మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. క్లైమాక్స్ లో మ‌రింత ఈజ్‌తో న‌టించాడు. కెరీర్ ప్రారంభంలో వ‌రుస‌గా రెండు హిట్లు ద‌క్క‌డం మామూలు విష‌యం కాదు. త‌న‌కు ఇది మంచి ఆర‌భం. ఇప్పుడు ‘మ్యాడ్ 2’ సెట్స్‌పై ఉంది. దీనిపై కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి. కాబ‌ట్టి మూడో సినిమా విష‌యంలోనూ చూసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. సోలో హీరోగానో, ఇలా ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌తో క‌లిసి చిన్న చిన్న మ‌ల్టీస్టార‌ర్లో చేసుకొంటూ ముందుకు వెళ్తే.. క‌చ్చితంగా యూత్ హీరోల‌కు నితిన్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌డు. ప్ర‌స్తుతం త‌న చేతిలో ఐదారు క‌థ‌లున్నాయి. నిర్మాత‌లు కూడా నితిన్ తో సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్నారు. మ‌రి ఈసారి ఎలాంటి క‌థ‌కు ప‌చ్చ జెండా ఊపుతాడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా...? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా...? బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై...

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close