`రాధేశ్యామ్‌` నేష‌న‌ల్ అవార్డు ఖాయ‌మా?

మ‌రో రెండు రోజులే. `రాధే శ్యామ్‌` బొమ్మ ప‌డిపోతుంది. రూ.300 కోట్ల సినిమా జాత‌కం తెలిసిపోతుంది. ఈ సినిమా ఏ క్ష‌ణంలో మొద‌లెట్టారో, చిత్రీక‌ర‌ణ సా….గు…తూ….నే ఉంది. ఎట్ట‌కేల‌కు పూర్త‌య్యింది. అయితే ఈ సినిమాపై అంచ‌నాలు పెరుగుతూ, త‌గ్గుతూ రావ‌డం విచిత్రం. సినిమా మొద‌లెట్టిన‌ప్ప‌టి హైపు మ‌ధ్య‌లో లేదు. అయితే విడుద‌ల‌కు ముందు అనూహ్య‌మైన హైప్ క్రియేట్ అయ్యింది. విడుద‌ల‌కు ముందు ఈ క్రేజ్ ఉండ‌డం సంతోషించాల్సిన విష‌య‌మే.

రూ.300 కోట్ల తో రూపొందిన సినిమా ఇది. అలాగ‌ని చారిత్ర‌క, జాన‌ప‌ద, గ్రాఫిక్స్ హంగులు కావ‌ల్సిన సినిమా కాదు. ఓ ప్రేమ‌క‌థ‌కు రూ.300 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం విచిత్ర‌మే. కానీ ప‌రిస్థితులు, ఈ సినిమా కోసం ఎంచుకున్న నేప‌థ్యం బ‌డ్జెట్ ని పెంచేశాయి. ముఖ్యంగా సెట్స్‌కి ఎక్కువ ఖ‌ర్చ‌య్యింది. ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్స్ వేశారు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్‌. బ‌హుశా.. టాలీవుడ్ లో ఇదో రికార్డేమో.? బాహుబ‌లి కోసం కూడా ఇన్ని సెట్లు వేయ‌లేదు. ఈ సినిమా ఇటీవ‌ల కొంత‌మంది ప్ర‌ముఖులు చూశారు. వాళ్లంతా సెట్స్ గురించి ప్రత్యేకంగా ప్ర‌స్తావించార్ట‌. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ సినిమా చూసి `ఆర్ట్ విభాగం ప‌నిత‌నం చాలా బాగుంది. క‌చ్చితంగా ఈ సినిమాకి ఆర్ట్ లో నేష‌న‌ల్ అవార్డు వ‌స్తుందనిపిస్తోంద‌`ని కాంప్లిమెంట్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లోనూ సెట్స్‌కి ప్రాధాన్యం ఉంది. అయినా స‌రే, అయిన `రాధేశ్యామ్‌`ని ప్ర‌త్యేకంగా మెచ్చుకున్నారంటే.. విశేష‌మే. ఈ సినిమా కోసం నాలుగు ట్రైన్ సెట్స్ వేశారు ర‌వీంద‌ర్‌. ఓ భారీ షిప్ సెట‌ప్ కూడా ఉంది. నిజానికి ఇటాలియ‌న్ క‌ల్చ‌ర్‌లో ఓ ఇండియ‌న్ సినిమా, అందులోనూ తెలుగు సినిమా తీయ‌డం ఇదే తొలిసారి. ఇట‌లీ క‌ట్ట‌డాల్ని పోలిన నిర్మాణాలు హైద‌రాబాద్‌లో సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు. అక్క‌డి ట్రైన్ సెట‌ప్ మొత్తం ఇక్క‌డ రీ క్రియేట్ చేశారు. క్లైమాక్స్ అంతా షిప్ లోనే. ఈ త‌ర‌హా క్లైమాక్స్ తెలుగులోనే కాదు, ఇండియ‌న్ స్క్రీన్ పైనే చూడ‌లేదంటున్నారు. సాధార‌ణంగా షిప్ అన‌గానే.. పైకి క‌నిపించే సెట‌ప్ ఒక‌టి సెట్ చేస్తే చాలు. కానీ.. దాని మెకానిజం, ఇంజ‌న్ కూడా సృష్టించ‌డం… ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close