బిగ్ బాస్‌లో కేక పెట్టించిన న‌వ‌దీప్‌

బిగ్ బాస్ తెలుగు షోని రెగ్యుల‌ర్‌గా ఫాలో అవుతున్న వాళ్లంద‌రికీ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ భ‌లే న‌చ్చేసి ఉంటుంది. కావ‌ల్సినంత ఫ‌న్‌, మ‌జా…. ఈ ఎపిసోడ్‌లోనే దొరికింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కి సెల‌బ్రెటీల దిమ్మ తిరిగిపోయింది.
దానికి త‌గ్గ‌ట్టు న‌వ‌దీప్ కూడా కేక‌లు పెట్టించేశాడు. బిగ్ బాస్ సెట‌ప్‌ని ఓ స్టార్ హోట‌ల్‌గా మార్చేసి.. న‌వ‌దీప్ – దీక్ష ల‌ను క‌స్ట‌మ‌ర్లుగా లోప‌ల‌కు పంపారు. మిగిలిన వాళ్లు వీరిద్ద‌రికీ సేవ‌లు చేయాల‌న్న‌మాట‌. క‌ష్ట‌మ‌ర్లు అడిగితే `నో` చెప్ప‌కూడ‌దు. ఒక‌వేళ మూడుసార్లు నో చెబితే…. ఈ టాస్క్‌లో వాళ్లు ఓడిపోయిన‌ట్టే. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొన్నాడు న‌వ‌దీప్‌. అర్చ‌న చేత మ‌సాజ్ చేయించుకొన్నాడు. మిగిలిన వాళ్ల‌ని ముప్పు తిప్ప‌లు పెట్టాడు. కాలి వేళ్ల‌కు ఉన్న వెంట్రుక‌ల‌ను నోటితో తీయ్‌.. అని ఆర్డ‌రేశాడు. ఆ అరాచ‌కం బుల్లి తెర‌పై చూడాల్సివ‌స్తుందేమో అని కంగారు పెడితే.. అర్చ‌న ఈ టాస్క్‌కి నో చెప్పేసి బ‌తికించింది. దీక్ష అయితే.. శివ బాలాజీ, ధ‌న‌రాజ్, ముమైత్‌ల‌ను ఓ ఆట ఆడుకొంది. శివ బాలాజీ, ధ‌న‌రాజ్ ష‌ర్టు విప్పి మ‌సాజ్ చేశారు. దాంతో చిన్న సైజు `ఏ` సినిమా చూసిన ఫీలింగ్ క‌లిగింది ఆడియ‌న్స్‌కు. కాస్త ఓవ‌ర్‌గా అనిపించినా ఓవ‌రాల్‌గా మంగ‌ళ‌వారం ఎపిసోడ్ కేక పుట్టించేసింది. టాస్క్ సంగ‌తేమో గానీ.. న‌వ‌దీప్ రావ‌డంతో ఈ షోకి కొత్త గ్లామ‌ర్ వ‌చ్చిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.