య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

‘కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ‘కేజీఎఫ్‌’ త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి య‌శ్ ఒప్పుకొన్నాడు. ఈ సినిమా కోసం ‘టాక్సిక్‌’ అనే పేరు ప‌రిశీలన‌లో ఉంది. ప్ర‌స్తుతం క‌థానాయిక ఎంపిక‌పై చిత్ర‌బృందం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్పుడు ఆ వ్య‌వ‌హారం కూడా ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. క‌థానాయిక‌గా న‌య‌న‌తార దాదాపుగా ఫిక్స్ అయిన‌ట్టే. మొద‌ట్లో కైరా అద్వాణీ, శ్రుతిహాస‌న్ లాంటి పేర్లు వినిపించాయి. అయితే న‌య‌న‌తార ఇప్పుడు రేసులోకి వ‌చ్చింది. య‌శ్‌తో న‌టించ‌డం న‌య‌న‌కు ఇదే తొలిసారి. అంతేకాదు, సుదీర్ఘ విరామం త‌ర‌వాత న‌య‌న ఒప్పుకొన్న క‌న్న‌డ సినిమా ఇది. ఇది వ‌ర‌కు ఉపేంద్ర‌తో `సూప‌ర్‌` అనే సినిమా చేసింది. ఆ త‌ర‌వాత‌… ‘టాక్సిక్‌’కు ఓకే చెప్పింది. ఓ కీల‌క‌మైన పాత్రలో క‌రీనాక‌పూర్ క‌నిపించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిపై చిత్ర‌బృందం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సివుంది. ప్ర‌తినాయ‌కుడిగా ఓ స్టార్ హీరో న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ఛాన్స్ ద‌క్షిణాది హీరోల‌కే ద‌క్క‌బోతోంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ద‌ర్శ‌కురాలు ఏమంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close