వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎద‌రు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ బాల‌య్య మోక్ష‌జ్ఞ ఎంట్రీని లైట్ గా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు అందుకు సమ‌యం కుదిరింది. మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం బాల‌య్య ఇప్పుడు సీరియ‌స్ గా దృష్టి పెట్టారు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో.. బాల‌య్య కొన్ని క‌థ‌లు విన్నాడ‌ట‌. అది మోక్ష‌జ్ఞ కోస‌మే. కొంత‌మంది యువ ద‌ర్శ‌కుల‌తో బాల‌య్య భేటీ అయిన‌ట్టు.. మోక్ష‌జ్ఞ క‌థ‌ల గురించి ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఫిట్ నెస్‌, న‌ట‌న‌కు సంబంధించిన మెళ‌కువ‌లు.. వీటికి సంబంధించిన విష‌యాల‌పై త‌ర్ఫీదు కోసం కొంత‌మంది నిపుణుల్ని కూడా నియ‌మించార్ట‌. మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతం న‌ట‌న‌, ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టార‌ని, పాత సినిమాల్ని విధిగా చూస్తూ.. అప్పుడ‌ప్పుడూ యువ ద‌ర్శ‌కులతో భేటీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ప‌రిస్థితి చూస్తుంటే 2021లో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయంలానే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 5.0 : ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్నల్..!

ఎట్టకేలకు..దాదాపుగా ఆరు నెలల గ్యాప్ తర్వాత సినిమా ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0లో భాగంగా..అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రారంభించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు...

మద్యం అక్రమ రవాణాలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం రవాణాను రాజకీయ పార్టీల నేతలు సైడ్ బిజినెస్‌గా చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేసిన బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఈ సారి వైసీపీ నేత...

రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చేతులు మిగలవు : సీపీఐ నారాయణ

కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా...

ప‌వ‌న్ సినిమా… మిర‌ప‌కాయ్ – 2?

హ‌రీష్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా `మిర‌ప‌కాయ్`. నిజానికి ఈ సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీయాల‌నుకున్నాడు హ‌రీష్‌. కానీ కుద‌ర్లేదు. అది గుర్తుపెట్టుకునే హ‌రీష్ శంక‌ర్‌ని పిలిచి `గ‌బ్బ‌ర్ సింగ్‌`...

HOT NEWS

[X] Close
[X] Close