బి.బి.బి: బాల‌య్య‌+బి.గోపాల్‌+బుర్రా సాయిమాధ‌వ్‌

బి.బి#3.. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇలానే పిలుచుకుంటున్నారు. ఆ త‌ర‌వాత బి.బి.బి కూడా రాబోతోంది. అంటే బాల‌య్య‌, బి.గోపాల్‌, బుర్రా సాయిమాధ‌వ్ ల సినిమా అన్న‌మాట‌. బి.గోపాల్ తో ఓ సినిమా చేస్తాన‌ని బాల‌య్య ఇది వ‌ర‌కే మాటిచ్చాడు. కానీ.. బాల‌య్య‌కు స‌రిప‌డా క‌థ‌ని త‌యారు చేసుకోవ‌డంలో బి.గోపాల్ విఫ‌లం అయ్యారు. దాంతో ఈకాంబో ఉంటుందా, లేదా? అనే డౌటు మొద‌లైంది. ఎట్ట‌కేల‌కు బి.గోపాల్ ఓ క‌థ‌ని రెడీ చేసేసిన‌ట్టు టాక్‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ బాల‌య్య కోసం ఓ క‌థ రాశారు. అది.. బి.గోపాల్ చేతిలో ప‌డింది. ఇప్పుడు ఈ క‌థ‌తోనే బాల‌య్య‌తో సినిమా చేయ‌బోతున్నార్ట‌. ఇప్ప‌టికే లైన్ సిద్ధ‌మైంది. ఒక‌ట్రెండు రోజుల్లో బాల‌య్య‌తో సిట్టింగ్ వేయ‌బోతున్నారు. బాల‌య్య‌కీ న‌చ్చితే.. ఈ సినిమా ప‌నులు మొద‌లైపోతాయి. బోయ‌పాటి సినిమా పూర్త‌వ్వ‌గానే ఇదే ప‌ట్టాలెక్క‌బోతోంది. మ‌రోవైపు వినాయ‌క్ కూడా బాల‌య్య కోసం ఓ కథ‌ని సిద్ధం చేస్తున్నారు. లూసీఫ‌ర్ రీమేక్ ప‌నుల‌తో పాటుగానే బాల‌య్య క‌థ‌పైనా వినాయ‌క్ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close