71వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. ఉత్తమ సంగీతం (నేపథ్యం) యానిమల్ హర్షవర్థన్ రామేశ్వర్, బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్) బేబీ సాయి రాజేశ్ అవార్డులు దక్కించుకున్నన్నారు. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) ‘హను-మాన్’కు అవార్డు దక్కింది. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది. 2023 చిత్రాలకుగానూ ఈ పురస్కారాలను అందిస్తున్నారు.