నర్త‌నశాల ట్రైల‌ర్‌: ఆనాటి సౌర‌భాలు

బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌కత్వంలో మొద‌లెట్టిన‌ చిత్రం `న‌ర్త‌న శాల‌`. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా 5 రోజులు షూటింగ్ జ‌రుపుకుని ఆగిపోయింది. అప్ప‌ట్లో తీసిన రెండు స‌న్నివేశాల్ని.. ఇప్పుడు, ఇంత‌కాలానికి విడుద‌ల చేస్తున్నారు. ఈనెల 24 ఉద‌యం 11.47 నిమిషాల‌కు ఈ చిత్రాన్ని శ్రియాస్ ఓటీటీ ద్వారా విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు 66 సెక‌న్ల ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు.

`ఈ అజ్ఞాత‌వాస‌ము విజ‌య‌వంత‌ముగా ముగించ‌వ‌లెన‌న్న నాపైనే ఎక్కవ‌గా ఉన్న‌‌ది` అనే బాలకృష్ణ డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది.

`పాండురాజు త‌న‌యుల‌కు లేని క‌ష్టం.. నాకా?` అంటూ ద్రౌప‌తి (సౌంద‌ర్య‌),

`రాచ‌బిడ్డ‌గా పుట్టినందుకు ఆవేశం స‌గ‌పాలు. మీ త‌మ్ముడిగా పుట్టినందుకు శాంతం స‌గ‌పాలూ వ‌చ్చినాయి` అంటూ భీమ‌సేనుడు (శ్రీ‌హ‌రి) చెప్పిన డైలాగులు ట్రైల‌ర్‌లో క‌నిపించాయి.

శ్రీ‌హ‌రి, సౌంద‌ర్య‌లాంటి న‌టీన‌టుల్ని మ‌ళ్లీ తెర‌పై చూడ‌డం ముచ్చ‌టైన విష‌య‌మే. అయితే శ్రీ‌హ‌రికి చెప్పిన డ‌బ్బింగ్ ఎందుకో కుద‌ర‌లేద‌నిపించింది.

17 నిమిషాల సినిమాలో… ఆ రెండు స‌న్నివేశాలూ అరణ్య‌వాసానికి సంబంధించిన‌వే అని తెలుస్తూనే వుంది. న‌ర్త‌న‌శాల‌ని బాల‌య్య ఎలా తీర్చిదిద్ది ఉండేవాడో అని తెలుసుకోవ‌డానికి ఈ రెండు స‌న్నివేశాలూ ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వ‌బోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.