జగన్ “క్యాలెండర్‌”పై నెగెటివ్ టాక్..!

ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్స్ క్యాలెండర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాత ట్వీట్లను బయటకు తీయడమే కాదు.. ఇటీవలి కాలంలో చేసిన ప్రకటనలను కూడా బయటకు తీసి.. ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌తో పోల్చి చూపిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో రెండున్నర లక్షల ఖాళీలు ఉన్నాయని.. వైసీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటగా.. ఆ రెండున్నర లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటికి రెండు జనవరి ఒకటిలు వెళ్లిపోయాయి కానీ జాబ్స్ క్యాలెండర్ రాలేదు.

కాస్త లేటైనా.. లక్షల్లో జాబ్స్ వస్తాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. తీరా క్యాలెండర్ ప్రకటించే సమయానికి మొత్తంగా పదివేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ గ్రూప్ వన్, టు ఉద్యోగాలు 50 కూడా లేవు. గ్రూప్ వన్.. టు ఉద్యోగాల కోసమే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కష్టపడుతూంటారు. నోటిఫికేషన్లు వస్తాయని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూంటారు. ఇప్పుడు ఇచ్చిన ప్రకటన చూసి.. వారు నిరాశపడ్డారు. సోషల్ మీడియాలో వారు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇక పోలీసు ఉద్యోగాల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు. ఆరేడు వేల పోస్టులు ఏడాదికి భర్తీ చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. చివరికి నాలుగు వందల పోస్టులు మాత్రమే చూపించారు.

పోస్టుల్ని చూసి నిరుద్యోగులు హతాశులవుతున్నారు. వాలంటీర్లు.. కోవిడ్ తాత్కాలిక ఉద్యోగాలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలా.. ఇక వేరే వాటికి చాన్స్ లేదా..అని ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. ఈ క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాలను వచ్చే ఏడాది మార్చి వరకూ భర్తీ చేస్తారు. చేస్తారో… వాటిని కూడా మధ్యలోనే నిలిపివేస్తారో తెలియని పరిస్థితి. మొత్తానికి ఈ జాబ్ క్యాలెండర్ … మంచి పేరు తీసుకురాకపోగా నిరుద్యోగుల్లో నిరాశా.. నిస్ప్రహలు పెరిగేలా చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close