నెల్లూరు అరుణ. ఈ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఓ బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆ ఆట ఆడారు. వైసీపీ హయాంలో బయటకు రాలేదు. కానీ ఇప్పుడు అదే ఆట ఆడాలనుకున్నారు. కానీ దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్నీ బయటకు వస్తున్నాయి.
ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి నెల రోజుల పెరోల్ పచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పెరోల్ ఇవ్వడం మంచిది కాదని నిరాకరించారు. కానీ ఓ రోజు హఠాత్తుగా జీవో వచ్చేసింది. దాంతో గగ్గోలు రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి మొత్తం థ బయటకు తీసింది. అంతా ఓ మహిళ చేసిందని.. కొంత మంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది.
ఆ మహిళ పేరు అరుణ. నెల్లూరులో బొతిక్ నిర్వహిస్తారు. వైసీపీ హయాంలో ఆమె పోలీసులకు.. రాజకీయ నేతలకు బొకేలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో కనిపించారు. ఆ సమయంలోనే ఆమె సెటిల్మెంట్లు చేసేవారు. ఏ పనైనా పోలీసు శాఖలో అయితే ఇట్టే చేయించేవారు. దీంతో ఆమె పలుకుబడి పెరిగిపోయింది. ఈమె లవరే శ్రీకాంత్. హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఓ సారి అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ అరుణ తన లవర్‌తో శృంగారం చేసేందుకు నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి పోలీసులు అడ్డు చెప్పలేదు. వారిద్దరూ రొమాన్స్‌లో మునిగి తేలారు. కానీ వీడియోలు తీశారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈమె భర్త అనుమానాస్పదస్థితిలో చనిపోయాడని చెబుతున్నారు. ఇప్పుడీ అరుణ గురించి మొత్తం బయటకు వస్తోంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు ఎవరు.. రాజకీయ నేతలు ఎవరు.. అేది బయటకు తీసే అవకాశం ఉంది.