రివ్యూ: న్యాయం క‌ళ్లు తెరిపించిన ‘నెరు’

Neru Movie review

సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయడంలో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు జీతూ జోసెఫ్‌. ఆయన మోహన్ లాల్ తో తీసిన ‘దృశ్యం’ ఫ్రాంచైజ్ దాదాపు అన్నీ బాషల్లో రీమేక్ రూపంలో వెళ్లి దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పుడు మోహన్ లాల్ కథనాయకుడిగా ‘నెరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ‌ల‌యాళంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి వసూళ్ళు దక్కాయి. ఇప్పుడీ సినిమా నేరుగా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైయింది. కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామాగా మలిచిన ఈ కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? జీతూ జోసెఫ్‌ మరోసారి తన మార్క్ చూపించారా?

అది కేరళలోని తుంబా అనే ప్రాంతం. సారా మహ్మద్‌ (అనస్వర రాజన్‌)అనే చూపులేని అమ్మాయిని ఓ దుండగుడు అత్యాచారం చేస్తాడు. సారాకి చూపులేదు కానీ, శిల్పాలు చెక్కె ప్రతిభ వుంటుంది. తన చేతులతో తాకిన మొహాన్ని శిల్పం రూపంలో గీయగలదు. అలా ఆ దుండగుడి బొమ్మని గీస్తుంది. దాని ఆధారంగా మైఖేల్‌ జోసెఫ్‌ (శంకర్‌ ఇందుచూడన్‌) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ కేసులో అరెస్టయిన మైఖేల్‌ దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు. ఈ కేసు నుంచి మైఖేల్ ని తప్పించడానికి దేశంలోనే ప్రముఖ లాయర్ రాజశేఖర్‌ (సిద్ధిఖ్‌) రంగంలో దిగుతాడు. కోర్టులో రాజశేఖర్‌ ని ఎదుర్కోవ‌డం ఎవరి తరం కాదు. ఫస్ట్ హియరింగ్ లోనే మైఖేల్ కి బెయిల్ వచ్చేలా కేసుని నీరు గార్చేస్తాడు రాజశేఖర్. ఇలాంటి పరిస్థితిలో ఈ కేసుని విచారిస్తున్న పోలీస్ అధికారి, సారా తరపున వాదించాలని లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ను కోరతాడు. మొదట ఈ కేసులో రావడానికి విముఖత చూపించిన విజయ్ మోహన్ తర్వాత కేసుని వాదించడానికి ముందుకు ఒప్పుకొన్నాడు? తర్వాత కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? విజయ్ మోహన్ గతం ఏమిటి? చివరికి సారాకి న్యాయం జరిగిందా? లేదా? అనేది తక్కిన కథ.

చివరి వరకూ సస్పెన్స్ ని కొనసాగించడం జీతూ జోసెఫ్‌ స్టయిల్. ఆయన కథలన్నీ క్రైమ్ లోని ఒకొక్క లేయర్ ని ప్రేక్షకులు ఊహకు అందనట్లు చూపించి థ్రిల్ పంచుతుంటాయి. కానీ ‘నెరు’ కథనాన్ని మాత్రం ఇందుకు భిన్నంగా నడిపారు. తొలి రెండు సన్నివేశాల్లోనే నేరం ఎలా జ‌రిగింది? దోషి ఎవ‌రు? అనేది ప్రేక్షకులకు స్పష్టంగా చూపించేస్తారు. ఈ రెండూ తెలిసిపోయినా తర్వాత ఇందులో ఏముంది చూడానికి… అని మాత్రం అనుకోలేడు ప్రేక్షకుడు. ఇక్కడే ఈ కథ ప్రేక్షకులను అయస్కాంతంలా పట్టుకుంటుంది. న్యాయస్థానాలు సాక్ష్యాలు మీద పని చేస్తాయి. నేరాన్ని, నిజాన్ని నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి. కోర్టులు ‘ఐ విట్నెస్’ లని ఇంకా బలంగా పరిగణలో తీసుకుంటాయి. అయితే చూపే లేని ఓ అమాయకురాలిపై అఘాయిత్యం జరిగితే దానికి ఎవరు సాక్ష్యం? ఆ బాధితురాలు తనకు జరిగిన దారుణాన్ని కోర్టులో ఎలా నిరూపించగలిగింది ? ఈ కోణంలో దర్శకుడు నడిపిన కథనం చాలా చోట్ల ఆలోజింపచేస్తూ భావోద్వేగాన్ని పంచుతుంది.

తొలి సన్నివేశంతోనే ప్రేక్షకులని కథలో కూర్చోబెట్టారు. నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నా.. ఆ నిజాన్ని కోర్టులో రుజువుచేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళు ప్రేక్షకులని కథలో లీనం చేస్తాయి. నిజానికి సింగిల్ లైన్ పై ఆధారపడిన చిన్న కథ ఇది. అదిరిపోయే మలుపులేమీ వుండవు. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు, కోర్టు రూమ్ డ్రామా ప్రేక్షకుల ద్రుష్టిని తిప్పుకొనివ్వవు. అక్కడ జరుగుతున్న‌ వాదనల్లో సెక్షన్స్ గురించి ప్రేక్షకుడికి అవగాహన లేకపోయినా.. బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అనే ఎమోషన్ ఆద్యంతం కొనసాగుతుంది. తమ క్లయింట్ ని కేసు నుంచి బయటపడేయడానికి లాయర్లు ఎంత వ‌ర‌కూ వెళ్తారు? ఆధారాలని ఎలా తారుమారు చేస్తారు? బాధితులని మానసికంగా ఎలాంటి క్షోభకి గురి చేస్తారు? ఈ కోణంలో కొన్ని సన్నివేశాలు వుంటాయి. న్యాయం కోసం పోరాటం చేసే వారు, మానసికంగా బలంగా నిలబడాలనే అంతర్లీన‌ సందేశం ఆ సన్నివేశాల్లో అందివ్వడం బావుంది.

అయితే ఈ కోర్టు రూమ్ డ్రామాలో కొన్ని పలుచని సన్నివేశాలు కూడా వున్నాయి. ఆధారాల కోసం ఎక్కువగా సిసి టీవీ పుటేజ్ మీదే ఆధారపడిపోయారు. సిసి పుటేజ్ ని ఎడిట్ చేసిన విధానం, దాన్ని కోర్టులో వివరంగా చూపించడం, ఒకే అంశం చుట్టూ పడేపదే ప్రశ్నలు వేయడం కాస్త రిపిటెడ్ గా వుంటుంది. అయితే దర్శకుడు రాసుకున్న ముగింపు మాత్రం ఈ లోపాల్ని సరిచేసేస్తుంది. సినిమా అంతా ఒకెత్తు, క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ కేసుని తన సాయశక్తుల వాదించిన విజయ్ మోహన్, చివరి ప్రయత్నంగా తీసుకున్న ఓ నిర్ణయం ఈ కథని మరో స్థాయిలో నిలబెట్టింది. నిజానికి ఈ కథకు అలాంటి ముగింపు లేకపోతే అసలు ప్రత్యేకతే వుండేది కాదు. ఇది లాయర్ విజయ్ మోహన్ కథ కాదు.. అంధురాలైన శిల్పి సారా కథ. దీనికి న్యాయం చేస్తూ ఇచ్చిన ముగింపు గుర్తుండిపోతుంది. చివర్లో సారా, లాయర్ విజయ్ మోహన్ మొహాన్ని తాగిన సన్నివేశం చూస్తున్నపుడు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగేస్తాయి. ఇది కదా హీరోయిజం అనిపిస్తుంది. సారా కోర్టు నుంచి బయటికి వస్తూ తన ముసుగుని తీసేయడం, మీడియా మైకులు, కెమెరాలు స్వతహాగా కిందకు దించేయడం గూస్ బంప్స్ మూమెంట్.

కోర్టు రూమ్ డ్రామాలో వాదించడానికి తప్పితే నటించడానికి ఏముంటుదని అనుకోవడానికి లేదు. ఈ సింగిల్ లైన్ కథని చివరకూ చూసేలా చేయగలిగింది మోహన్ లాల్ ప్రజెన్స్. ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా మోహన్ లాల్ చేసిన మరో కథ ఇది. దృశ్యం తరహాలో ఎత్తుకుపై ఎత్తు వేసే పాత్ర కూడా కాదు. కేవలం సెక్షన్స్, లా పాయింట్లు తో ఎదురుగా వున్న పెద్ద లాయర్ తో తలపడే పాత్ర. ఈ పాత్రని తన సహజమైన నటనతో పండించారు. చూపులేని అమ్మాయి పాత్ర పోషించిన అనస్వర రాజన్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆమె నటన కథకి మరింత సహజత్వాన్ని తెసుకొచ్చింది. ఇందులో ప్రియమణి, మోహన్ లాల్ పాత్రల మధ్య ఓ గతం వుంది. ఆ గతాన్ని చూపించకుండా వాయిస్ కి పరిమితం చేయడం బావుంది. సిద్ధిఖ్‌, జగదీశ్, ప్రియమణి పాటు మిగతా పాత్రలు పరిధిమేర ఆకట్టుకున్నారు. నేపధ్య సంగీతం బాగా కుదిరింది. నిర్మాణంలో కొన్ని పరిమితులు కనిపిస్తాయి. కమర్షియల్ హంగులతో కాకుండా మంచి కథ, కథనంతో మ్యాజిక్ చేసే దర్శకుడు జీతూ జోసెఫ్‌. ‘నెరు’లో కూడా ఆ మ్యాజిక్ కుదిరింది. ఈ వీకెండ్ లో ఓటీటీ సినిమాల కోసం వెదికే ఆడియన్స్ కి ‘నెరు’ మంచి ఛాయిస్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close