స‌ముద్రాన్ని ఆదుకున్న నెట్ ఫ్లిక్స్‌

ఈమ‌ధ్య మంచి బ‌జ్ తో విడుద‌లైన సినిమాల్లో `మ‌హా స‌ముద్రం` ఒక‌టి. ఆర్‌.ఎక్స్ 100 త‌ర‌వాత అజ‌య్ భూప‌తి తీసిన సినిమా ఇది. దానికి తోడు ట్రైల‌ర్లు, టీజ‌ర్లూ అదిరిపోయాయి. దాంతో.. మ‌హా స‌ముద్రంపై అంచ‌నాలు పెరిగిపోయాయి. తీరా చూస్తే… సినిమా డిజాస్ట‌ర్ అయిపోయింది. నెగిటీవ్ రివ్యూల ప్ర‌భావంతో – వ‌సూళ్లు ఢామ‌ని ప‌డిపోయాయి. 28 కోట్ల సినిమా ఇది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 కోట్లు కూడా రాలేదు. దాన్ని బ‌ట్టి.. ఎంత పెద్ద ఫ్లాపో ఊహించుకోవొచ్చు.

కానీ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్.. స్వ‌ల్ప న‌ష్టాల‌తో ఊపిరి పీల్చుకుంది. దానికి కార‌ణం.. ఓటీటీ, శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కార‌ణం. ట్రైల‌ర్ రిలీజ్ అయిన వెంట‌నే… నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల్ని కైవ‌సం చేసుకుంది. ఏకంగా 9.5 కోట్ల‌తో ఓటీటీ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 3.5 కోట్లు వ‌చ్చాయి. శాటిలైట్ రూపంలో మ‌రో 5 కోట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంటే.. నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలోనే.. 18 కోట్లు వ‌చ్చేశాయ‌న్న‌మాట‌. సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ అమ్మేశారు కాబ‌ట్టి.. స‌రిపోయింది. ఇప్పుడైతే – అందులో స‌గం కూడా వ‌చ్చేది కాదు. అలా నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ నిర్మాత‌ల్ని ర‌క్షించాయి. లేదంటే మ‌హా స‌ముద్రం పుణ్యాన‌.. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మునిగిపోయేదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

HOT NEWS

[X] Close
[X] Close