సోషల్ మీడియా సెగ: పవన్, బాబు లని ఎద్దేవా చేసిన అంబటి, ఆడుకున్న నెటిజన్లు

వైఎస్ఆర్ పీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కి నిన్నంతా సోషల్ మీడియా సెగ గట్టిగా తగిలింది. పవన్ కళ్యాణ్ , చంద్రబాబు లు కరోనా కారణంగా హైదరాబాదులోనే ఉండి పోయిన సంగతి తెలిసిందే. దానిని రాజకీయ ప్రయోజనం గా మార్చుకోవడం కోసం వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు పవన్ లు హైదరాబాద్ లోనే ఉంటూ ఆంధ్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కొంతకాలంగా హైలైట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే వీరు ఇద్దరూ హైదరాబాద్ లో జండా ఎగరవేయడాన్ని ఎద్దేవా చేస్తూ నిన్న ఉదయం అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

అంబటి రాంబాబు ట్వీట్ చేస్తూ,
“స్వాతంత్ర దినోత్సవ వేడుకలను
స్వరాష్ట్రంలో జరుపుకోలేని
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు
రాష్ట్ర రాజకీయాల గురించి
మాట్లాడే అర్హత ఉందంటారా ?” అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను ఎద్దేవా చేశారు.

అయితే ఊహించని విధంగా ఆయన ట్వీట్ బూమరాంగ్ అయింది. నెటిజన్లు ఒక రేంజ్ లో నిన్నంతా అంబటి రాంబాబు ని ఆడుకున్నారు. కొందరు సమాధానమిస్తూ, “2015 ఆగస్టు 15 న జగన్ కూడా హైదరాబాద్ నుంచి జెండా ఎగురవేశారు, మరి మీ లాజిక్ ప్రకారం, జగన్ కి మన రాష్ట్రానికి సిఎం గా ఉండటానికి అర్హత ఉందంటారా ?” అని ప్రశ్నిస్తే, “అయ్యా అంబటి రాంబాబు గారు, అది ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదు ఆంధ్ర లో నే జరుపుకోవటానికి….. స్వాతంత్ర్య దినోత్సవం ఏ రాష్ట్రంలో ఐనా జరుపుకోవచ్చు….మీ చిల్లర రాజకీయాలు ఆపండి ఇకనైనా!” అని మరి కొందరు ఎద్దేవా చేశారు. ఇంకొందరైతే ” అవునా? మరి కరోనా ఆంధ్రా లో వొస్తే అక్కడే వైద్యం చేపించుకోవాలి కదా! మరి పక్క రాష్ట్రానికీ ఎందుకు పారిపోయారు, జాతీయ పండుగను రాష్ట్రంలో జరుపుకోలేక పోవడానికే మాట్లాడే అర్హత లేకపోతే….. అధికారంలో ఉండి, కరోనా జబ్బు చేస్తే వైద్యము చేయించుకోడానికి వేరే రాష్ట్రం వెళ్లిన పార్టీ వాళ్లకి ఏమి అర్హత ఉందో మీ విజ్ఞత కే వదిలేస్తున్నాం.” అంటూ చురకలంటించారు.

మొత్తానికి జాతీయ జెండా ఎగర వేయడాన్ని , స్వాతంత్ర దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనంగా మలుచుకుందామని ప్రయత్నించిన అంబటి రాంబాబు కి షాక్ తగిలినట్లు అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close