డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల వ‌ల్ల వాయిదా ప‌డింది. ఇప్పుడు కొత్త డేట్ వ‌చ్చింది. ఈనెల 19 సాయింత్రం హైద‌రాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్నామ‌ని ద‌ర్శ‌కుల సంఘం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఆన్ లైన్లో టికెట్ల విక్ర‌యం మొద‌లైంది కూడా.

ఈ ఈవెంట్ లో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. రాజ‌మౌళి, నాని క‌లిసి ఓ స్కిట్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. హ‌రీష్ శంక‌ర్‌, బాబి లాంటి యువ ద‌ర్శ‌కులు కూడా కొన్ని స్కిట్లు చేయ‌బోతున్నార్ట‌. అనిల్ రావిపూడి, త‌మ‌న్నాలో ఓ డాన్స్ షో ఉంటుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో ఓ మ్యూజిక‌ల్ షో కూడా ఏర్పాటు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆర్పీ ప‌ట్నాయ‌క్‌, అనూప్‌ల సంగీత విభావ‌రి కూడా ఉండ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవిని అతిథిగా ఆహ్వానించారు. చిత్ర‌సీమ‌లోని దర్శ‌కులు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని ద‌ర్శ‌కుల సంక్షేమం కోసం వాడాల‌న్న‌ది ప్లాన్‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్ త‌న వంతుగా భారీ విరాళాన్ని ప్ర‌క‌టించాడు. మిగిలిన హీరోలూ చేయూత ఇస్తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close