తగ్గింపుతోనే జీతాలు.. కొత్త జీవో రిలీజ్ !

ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగుల్ని నచ్చ చెప్పేందుకు కమిటీ వేశామని చెబుతోంది చెబుతున్నా..తమ నిర్ణయాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేబినెట్ భేటీలో పీఆర్సీకి ఆమోద ముద్ర వేసేసి.. కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్‌ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. 11 వ పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేళ్లతోనే జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌, ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను సర్కారు ఆదేశించింది.

ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌ను అనుసరించి బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు సర్వీస్‌ గణించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. 25వ తేదీగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. డీడీవోలకు కొత్త పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది.

అయితే ఉద్యోగులు ఎవరూ తాము ఆ పని చేసేందుకు అంగీకరించడం లేదు. తమపై ఒత్తిడి తేవొద్దని అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమానికి తాము కూడా సంఘిభావం తెలుపుతున్నామని.. ట్రెజరీ.. పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతాయా.. లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close