29 పాత లేబర్ చట్టాలను ఏకీకృతం చేసి, నాలుగు కొత్త లేబర్ కోడ్లను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాలు రియల్ ఎస్టేట్ రంగానికి మంచిదా కాదా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువ మంది ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటి. ఈ చట్టాలు కార్మికులకు మెరుగైన రక్షణ, వేతన నియంత్రణ, సోషల్ సెక్యూరిటీ, వర్క్‌ప్లేస్ సేఫ్టీని హామీ ఇస్తున్నాయి.
బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్స్‌ను కలుపుతూ, బోనస్, HRA, గ్రాచ్యుటీ వంటివి మినహాయించి వేతనాన్ని 50%కి పరిమితం చేస్తుంది. ఇది సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్లను పెంచుతుంది. 5 సంవత్సరాల పని తర్వాత గ్రాచ్యుటీకి అర్హత పెంచి, వర్కర్లకు ఆర్థిక భద్రత ఇస్తుంది. ఈ మార్పులు రియల్ ఎస్టేట్‌లో లేబర్ కాస్ట్‌లు 15-30% పెరగవచ్చని అంచనా. మొత్తం డెవలప్మెంట్ కాస్ట్‌లు 3-4% శాతం పెరిగే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ రంగం భారీగా మెగా వర్క్‌ఫోర్స్‌పై ఆధారపడుతుంది. అయితే మెరుగైన వేతనాలు, గ్రాచ్యుటీ, సోషల్ సెక్యూరిటీతో వర్కర్లు లాంగ్-టర్మ్ కమిట్మెంట్ చేస్తారు. ఇది కన్స్ట్రక్షన్ ప్రొడక్టివిటీని పెంచుతుంది. డెవలపర్లు ఈ అదనపు ఖర్చులను కొనుగోదారులేక బదలాయిస్తారు. మొత్తంగా కొత్త లేబర్ చట్టాలు రియల్ ఎస్టేట్‌ను మరింత ఫార్మల్, వర్కర్-సెంట్రిక్ రంగంగా మారుస్తాయి.