కొత్త విధానంతో తెలంగాణా అంతటా విస్తరించనున్న ఐటి పరిశ్రమలు

ఐటి, కంప్యూటర్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి మాట్లాడుకొన్నప్పుడు హైదరాబాద్ లో వాటి అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు చేసిన కృషి గురించి తలుచుకోకుండా ఉండలేము. ఒకానొక సమయంలో ఐటి అంటే ఆయన పేరు తలుచుకొనేలా చేసారు. కానీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కె.టి.ఆర్. చాలా దూకుడుగా వ్యవహరిస్తూ తెలంగాణాకి ఇంకా అనేక ఐటి పరిశ్రమలని, దాని అనుబంధ సంస్థలని రప్పించగలుగుతున్నారు.

“ఏడాది క్రితం తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా దరఖాస్తు చేసుకొన్న రెండు వారాలలోగా 1,691 కంపెనీలకు అనుమతులు మంజూరు చేసామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సుమారు 800 పైగా కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉత్పత్తి దశకు చేరుకొన్నాయని తెలిపారు. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు, రూ.1.36 వేల కోట్ల ఐటి ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా నూతన ఐటి విధానం ప్రకటించారు.

దీనిలో మళ్ళీ నాలుగు ఉప-విధానాలున్నాయి. అవి 1. రూరల్ ఐటి. 2. ఇన్నోవేషన్. 3. గేమింగ్ అండ్ యానిమేషన్. 4. ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్.

వీటిలో రూరల్ ఐటి విధానం ద్వారా రాష్ట్రంలోని అంతగా అభివృద్ధి చెందని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలలో ఐటి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి భారీగా ప్రోత్సాహకాలు ఉంటాయి. తద్వారా ఐటి పరిశ్రమ హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతం కాకుండా రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తుంది కనుక ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా దాని వలన లబ్ది పొందుతారు. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టే ఉద్దేశ్యమేనని చెప్పవచ్చును. ఐటి పరిశ్రమను రాష్ట్రమంతటికీ సమాంతరంగా వ్యాపింపజేస్తూనే, తద్వారా గ్రామీణాభివృద్ధిని సాధించడం దీని లక్ష్యంగా కనబడుతోంది.

ఇన్నోవేషన్ విధానంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం అందించి, ఐటి రంగంలో కొత్త వ్యాపారావకాశాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. మూడు, నాలుగవ విధానాల ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి అవసరమయిన అన్ని రకాల సహాయసహకారాలను ప్రభుత్వం అందిస్తుంది. గత ఏడాది తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐ-పాస్ వంటి విధానాలు విజయవంతమయ్యి సత్ఫలితాలు ఇస్తున్నట్లే, ఇవ్వాళ్ళ ప్రకటించిన నూతన ఐటి విధానం కూడా సత్ఫలితాలు సాధించగలిగితే, ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నట్లుగా తెలంగాణా రాష్ట్రం ఐటి రంగంలో దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close