మీడియా: తెలుగు పత్రికల ధరలు పెరిగాయి..!

పెరుగుతున్న ఖర్చులు, జీఎస్టీ భారం కారణంగా.. తెలుగు దినపత్రికలు… ధరలు పెంచాయి. 13వ తేదీ అంటే మంగళవారం నుంచి… ఈ ధరలు పెరుగుతున్నట్లు… సోమవారం పత్రికల్లో బాక్స్ కట్టి ప్రరుచించే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ. 5 ఉన్న దినపత్రిక ఖరీదు.. రూ. ఆరున్నర… ఆదివారాల్లో రూ. 6 ఉన్న పత్రిక ధరను.. రూ. 8కి పెంచారు. ఇటీవలి కాలంలో పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలు, ట్రాన్స్‌ పోర్ట్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు చూసుకుని… రేట్లు పెంచకపోతే.. నిర్వహణ కష్టం అయిపోతుందని పత్రికల యాజమాన్యాలు.. నిర్ణయించుకున్నాయి. ఇటీవలి కాలంలో.. పత్రికల యజమానులంతా.. ఓ సంఘంగా ఏర్పడ్డారు. పత్రికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలసికట్టుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కొద్ది రోజుల క్రితం సమావేశమై.. రేట్లు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని పత్రికల ధరలూ.. అదే రీతిలో పెరగనున్నాయి. చివరికి సాక్షి పత్రిక కూడా పెంచబోతోంది.

సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో ఓ నినాదం ఉద్యమంలా తీసుకొచ్చారు. ఆ పత్రిక ధరను..రూ.2గా నిర్ణయించారు. మిగతా పత్రికలు కూడా.. రూ. 2కే ఎందుకివ్వరని ప్రశ్నలు ప్రారంభించారు. పాఠకుల దగ్గర నుంచి డిమాండ్లు కూడా వినిపించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. సాక్షి పత్రిక రేటు మిగతా పత్రికలతో సమాన స్థాయికి చేరింది. మామూలు రోజుల్లో రూ. 5, మిగతా రోజుల్లో రూ. 6గా కొనసాగుతోంది. ఇప్పుడు సాక్షి ఇతర పత్రికల రేట్లను తగ్గించాలని ఉద్యమాలు చేయడం లేదు. ఇతర పత్రికలతో కలిసి పోటీగా.. రేట్లు పెంచడానికి .. అవకాశం ఎదురు చూస్తోంది. ఇప్పుడు కూడా… సాక్షి పత్రిక అదే తరహాలో రేట్లు పెంచుతోంది. చివరికి నమస్తే తెలంగాణ కూడా.. ఈ విషయంపై ఏజెంట్లకు లేఖలు రాసింది.

రేట్లు పెరిగితే సర్క్యూలేషన్‌పై ఎక్కడ ప్రభావం పడుతుందోనని కొన్ని పత్రికలు ఆందోళనలో ఉన్నాయి. అందుకే సర్క్యూలేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెచ్చరికల్లాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరూ పత్రిక రేటు పెరిగిందన్న కారణంగా.. నిలిపి వేయకుండా చూడాలని… ఆదేశాలిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలకు కరపత్రాల్లాంటి… నమస్తే తెలంగాణ, సాక్షి లాంటి పత్రికలకు ఇది ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే.. ఆ పత్రికలను… పార్టీలపై అభిమానంతో కొంత మంది కొనుగోలు చేస్తూంటే.. మరికొంత సర్క్యూలేషన్ .. బలవంతంగా అంట గడుతున్న ఖాతాలోఉంది. అమాంతం రేట్లు పెంచితే.. వాళ్లంతా నిస్సంకోచంగా వదిలించేసుకుంటారనే భయం వీటికి ఉంది. మిగతా పత్రికలూ దీనికి మినహాయింపు కాదు. కాకపోతే… ఆ పత్రికకు ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు. రేట్లు పెంచిన తర్వాత వాటి సర్క్యూలేషన్ పై ప్రభావం కచ్చితంగా కనిపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close