కోడికత్తి కేసు చార్జిషీట్..! విశాఖ పోలీసులు చెప్పిందే ఎన్ఐఏ కనిపెట్టింది..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో… ఎన్ఐఏ వేసిన చార్జిషీట్ వివరాలు బయటకు వచ్చాయి. సిట్‌ రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్ఐఏ చార్జిషీట్ లో చెప్పింది. కోడి కత్తితో శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని.. దాని ప్రకారం.. సెక్షన్‌ 307 ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. శ్రీనివాసరావు..జగన్‌ అభిమాని అని..ఎన్ఐఏ కూడా.. స్పష్టంగా పేర్కొంది. జనగ్ కు సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని గతంలో… విశాఖ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఎన్ఐఏ కూడా.. ఇద విషయాన్ని పేర్కొంది. సిట్ రిపోర్ట్‌తో దాదాపుగా ఏకీభవించింది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడారని… సర్..మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని..జగన్‌తో శ్రీనివాసరావు చెప్పారని ఎన్ఐఏ చార్జిషీట్ లో తెలిపింది. దాడికి ముందే శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టులోని సహ ఉద్యోగులతో.. చర్చించినట్టు కొత్తగా ఎన్ఐఏ ధృవీకరించింది. హేమలత అనే సహా ఉద్యోగి సహకారంతో.. జగన్‌తో సెల్ఫీ తీసుకుంటానని అన్నాడని నిర్ధారించారు. గాయం అంత తీవ్రమైనది కాదని … జగన్‌ ఎడమ భుజంపై సెం.మీటర్‌ పొడవు, అర సెం.మీటర్‌ వెడల్పు గాయమైందని డాక్టర్లు చెప్పారని ఎన్ఐఏ చార్జిషీట్ లో తెలిపింది.

జగన్ కు ప్రాణ హానీ జరగకుండా.. కేవలం సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు.. ఎన్ఐఏ చార్జిషీట్ లో తెలిపింది. విచారణ కొనసాగుతోందని… మరిన్ని ఆధారాలు దొరికితే.. వాటి ఆధారంగా అదనపు చార్జిషీట్ ను… ఎన్ఐఏ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. మొదటి నుంచి.. ఈ ఘటన వెనుక.. తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అందుకే.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. కేంద్ర దర్యాప్త సంస్థ విచారణ కోరారు. కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి.. ఎన్ఐఏ విచారణ వేయించుకున్నారు. కానీ.. విశాఖ సిట్ పోలీసులు చెప్పిన దాన్నే… మరో విధంగా.. ఎన్ఐఏ చార్జిషీట్ లో చెప్పింది.

ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేసు ఎన్ఐఏకి ఇచ్చినప్పటి నుంచి… ఎన్ఐఏ విచారణ ఎలా సాగాలన్న దిశగా.. ప్రత్యేకంగా జగన్ మీడియా కథనాల మీద కథనాలు ప్రచురించింది. కుట్ర కోణం ఉందని.. ఎన్ఐఏ కనిపెట్టిందని చెప్పుకొచ్చారు. కానీ.. చివరికి కోడి కత్తి శ్రీనివాసరావు జగన్ అభిమానేనని ఎన్ఐఏ తేల్చడంతో.. ఇప్పుడు వైసీపీ నేతలు ఏ వాదన వినిపిస్తారోనన్నది వేచి చూడాలి. ఎన్ఐఏ అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తం చేసినా ఆశ్చర్యం లేదన్న భావన టీడీపీ వర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close