తిరుపతి దొంగ ఓటర్ కార్డులపై ఎన్‌ఐఏ విచారణ..!?

తిరుపతిలో దొంగ ఓటర్ కార్డులను ముద్రించడాన్ని దేశద్రోహ నేరంగా పరిగణించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో ఆయన నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. దేశ సార్వభౌమాధికార, సమగ్రతకు … దొంగ ఓటర్ కార్డులు తయారు చేయడం ప్రమాదకరమని రఘురామకృష్ణరాజు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లక్ష్యాలకు ఇలాంటి పనులు చేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో లక్షలాది దొంగ ఓటర్ కార్డులు ముద్రించారని.. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరుపతి దొంగ ఓటర్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే.. భారత్‌లో ఇలాంటి ఐడీ కార్డులు తయారు చేయడం.. వాటి ద్వారా సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడటం ఈజీ అన్న భావన పెరిగిపోతోందని ఆందోళన వెలి బుచ్చారు. తక్షణం కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ అంశంపై దృష్టి సారించి… దొంగ ఓటర్ కార్డుల్ని ప్రింట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓటర్ కార్డులపై ఫిర్యాదుల్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు కూడా పంపినట్లుగా రఘురామరామకృష్ణరాజు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఐఏ ద్వారా విచారణకు ఆదేశించాలని కోరారు.

దొంగ ఓటర్ కార్డులు ముద్రించడం నిజానికి చాలా తీవ్రమైన నేరం. కానీ కారణమేమిటో కానీ ఎన్నికల సంఘం కూడా పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులు అదేదో కామన్ అన్నట్లుగా వ్యవహరించారు. రేపు ఓటర్ కార్డులకు బదులు పాస్‌పోర్టులు కూడా ముద్రిస్తారనే అంశాన్ని గమించలేకపోయారు. కానీ.. రఘురామకృష్ణరాజు మాత్రం.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిజానికి హోంశాఖకు ఎంపీలు చేసే ప్రతి ఫిర్యాదుకు రికార్డు ఉంటుంది. ఏం చర్యలు తీసుకున్నారో ఫాలో అప్ ఉంటుంది. ఈప్రకారం చూస్తే.. తిరుపతి దొంగ ఓటర్ కార్డుల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటే ఎన్ఐఏ విచారణకు ఆదేశించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. చాలా పెద్ద పెద్ద కేసులే.. ఏపీకి వచ్చే సరికి స్లో అయిపోతున్నాయి.. ఇదెంత అన్న చర్చ కూడా సహజంగానే వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close