గుళ్లో పెళ్లి చేసుకుందామ‌నుకున్నా: నిఖిల్‌

క‌రోనా ఎఫెక్టుకి ఇబ్బంది ప‌డిన వాళ్ల‌లో నిఖిల్ కూడా ఉన్నాడు. ఎందుకంటే.. క‌రోనా వ‌ల్లే త‌న పెళ్లి వాయిదా ప‌డింది. ప‌ల్ల‌వి వ‌ర్మ అనే డాక్ట‌రుని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు నిఖిల్. కాక‌పోతే క‌రోనా వ‌ల్ల ఈ పెళ్లి ఆల‌స్యం అవుతోంది. అయితే ఓ ద‌శ‌లో గుళ్లో అయినా పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడ‌ట నిఖిల్‌. కానీ ఆ నిర్ణ‌యాన్నీ వాయిదా వేశాడు. ”అవును.. మేం హంగులూ, ఆర్భాటాలూ లేకుండా క‌నీసం గుళ్లో అయినా పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం. అయితే ఇలాంటి స‌మ‌యంలో పెళ్లి పేరుతో అంద‌రినీ ఒకే చోట గేద‌ర్ చేయ‌డం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకం. ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది క‌లిగినా ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది. అందుకే పెళ్లి వాయిదా వేశాం. అన్నీ స‌ర్దుకున్నాక ఓ పెద్ద వేడుక‌లా నా పెళ్లి జ‌రుగుతుంది” అని చెప్పుకొచ్చాడు నిఖిల్‌.

ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌ల్ల‌విని క‌లిశాన‌ని, ఆరు నెల‌ల్లోనే పెళ్లి వ‌ర‌కూ వెళ్లిపోయామ‌ని, త‌మ పెళ్లికి ఇరువురి కుటుంబ స‌భ్యులు ఆనందంగా ఒప్పుకున్నార‌ని చెప్పాడు నిఖిల్‌.అన్ని విష‌యాల్లోనూ ఇద్ద‌రి అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయ‌ని, ప‌ల్ల‌వి త‌న‌కంటే ఎన‌ర్జీగా ఉంటుంద‌ని త‌నకు కాబోయే శ్రీ‌మ‌తి గురించి చెప్పుకొచ్చాడు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో పాత సినిమాలు చూస్తున్నాన‌ని, బాడీ పెంచుతున్నాన‌ని, త‌మిళం కూడా నేర్చుకుంటున్నాన‌ని సెల‌విచ్చాడీ కుర్ర హీరో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close