నిఖిల్ చేతిలో మూడు సినిమాలు

‘అర్జున్ సుర‌వ‌రం’ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌డం నిఖిల్ కెరీర్‌ని బాగా దెబ్బ‌కొట్టింది. ఈ ఒత్తిడిలో కొత్త సినిమాల‌వైపు దృష్టి నిలుప‌లేక‌పోయాడు నిఖిల్‌. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇక మీద‌ట వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని ఫిక్స‌య్యాడు నిఖిల్‌. ‘కార్తికేయ 2’ ఈ డిసెంబ‌రులో మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. వి.ఐ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ‘కార్తికేయ 2’తో పాటు స‌మాంత‌రంగా ఈసినిమా మొద‌ల‌వుతుంది. దీంతోపాటు ‘హ‌నుమాన్‌’ అనే క‌థ‌కి ఓకే చెప్పాడు నిఖిల్‌. 2020 మార్చిలో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది. మొత్తానికి నిఖిల్ త‌న కెరీర్‌ని మ‌ళ్లీ గాడిలో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. నిఖిల్ కోసం నిర్మాత‌లు, ద‌ర్శ‌కులూ సిద్ధంగానే ఉన్నారు. ‘అర్జున్ సుర‌వ‌రం’ కాస్త ఓకే అనిపించుకుంటే – నిఖిల్ రేసులోకి వ‌చ్చిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close