బ‌య్య‌ర్ల డిమాండ్‌కి త‌లొగ్గిన నిఖిల్‌

నిఖిల్ సినిమా అర్జున్ సుర‌వ‌రం మ‌రోసారి వాయిదా ప‌డింది. డిసెంబ‌రులో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. మార్చి 28న విడుద‌ల చేస్తామ‌న్నారు. ఇప్పుడు మే 1కి వెళ్లిపోయింది. బ‌య్య‌ర్ల కోరిక మేర‌కే.. ఈ సినిమా ని వాయిదా వేయాల్సివ‌చ్చింది టీమ్ చెబుతోంద‌ట‌. ఇది ప‌రీక్ష‌ల సీజ‌న్‌. దాంతో పాటు ఎన్నిక‌ల హ‌డావుడి.. ఐపీఎల్ కూడా మొద‌లైపోతోంది. ఈ ద‌శ‌లో.. ఈ సినిమాని ఇప్పుడు విడుద‌ల చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్న‌ది బ‌య్య‌ర్ల‌మాట‌. ఈ విష‌య‌మై నిర్మాత‌తో చ‌ర్చించిన బ‌య్య‌ర్లు త‌మ పంతం గెలిపించుకున్నారు. మే 1న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. నిజానికి ఏప్రిల్ 19న మ‌రో ఆప్ష‌న్ దొరికింది. అయితే ఆరోజున డ‌బ్బింగ్ బొమ్మ `కాంచ‌న 3` విడుద‌ల అవుతోంది. దాంతో పాటు నాని సినిమా `జెర్సీ` కూడా రానుంది. అందుకే 19 కంటే మే 1ని క‌రెక్ట్ అని నిర్ణ‌యం తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close