“ఏకగ్రీవాల” ఆఫీసర్ల బదిలీ..! ఒప్పుకుంటారా..?

జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన తప్పులు.. లోపాలు పంచాయతీ ఎన్నికల్లో జరగకూడదన్న లక్ష్యంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారు. అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగిన చోట్ల ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడి రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు అసాధారణంగా ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో దాడులు, దౌర్జన్యాలు, పోలీసుల బెదిరింపులు ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి.. ఇతరులు పోటీలో ఉండకుండా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖుక ఎస్‌ఈసీ రాసిన లేఖలోనూ వీటి గురించి ప్రస్తావించారు.

ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా.. ఆయా ప్రాంతాల్లో జరుగుతూండటంతో… అధికారుల్ని మార్చాలని ఎస్‌ఈసీ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి సిఫార్సు చేశారు. ఏకగ్రీవాలు అయిన ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీవోలు వ్యవహరిస్తారు. అలాంటి వారినందర్నీ బదిలీ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో దాదాపుగా 30 మంది ఎంపీడీవోల బదిలీకి ఆదేశించారు. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో విస్తృతంగా అరాచకాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జరుగుతోందన్న ఆరోపణలు రావడంతో ఎస్‌ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

అయితే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పాటించడం లేదు. అతి కష్టం మీద ఒకటి.. రెండు ఆదేశాలను అమలు చేస్తున్నప్పటికీ.. అత్యధికం ధిక్కరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆంశంపై హైకోర్టులో పిటిషన్ పడింది. హైకోర్టు స్టేటస్ రిపోర్టు ఇవ్వమని ఆదేశించింది.^ఈ క్రమంలో… ఆ ఎంపీడీవోలను బదిలీ చేస్తారో లేకపోతే… వాళ్లతోనే ఎన్నికలు కొనసాగిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close