జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్.. రస్ అల్ ఖైమా సంస్థను పదే పదే మోసం చేస్తున్నారు. ఆ సంస్థ పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వకుండా.. న్యాయస్థానాలను సైతం మభ్యపెట్టేందుకు తన ఆస్తులన్నింటినీ ఇతరుల పేరు మీద బదిలీ చేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫుల్ బాల్ టీం ..కేరళ బ్లాస్టర్స్ ను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ..దాన్ని నిలువరించాలని రాకియా కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కేరళ బ్లాస్టర్స్ అమ్మకంపై ఏసీబీ కోర్టులో రాకియా పిటిషన్
కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ కు నిమ్మగడ్డ ప్రసాద్ కో ఓనర్ గా ఉన్నారు. 2016 నుండి క్లబ్ యాజమాన్యంలో కీలకంగా ఉన్నారు. ఇందులో మొదట్లో సచిన్ కూడా ఓ పార్టనర్ . తర్వాత ఆయన తన షేర్ అమ్ముకున్నారు. ఇప్పుడు తన పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఇతరుల పేరుపైకి మార్చే ప్రయత్నంలో ఆయన ఈ ఫుల్ బాల్ క్లబ్ ను కూడా అమ్మేస్తున్నారు. ఇప్పటికే అమ్మకం అయిపోయిందేమో కానీ.. నిమ్మగడ్డతో తమకు సంబంధం లేదని ఆయనకు సంబంధించిన చాలా కంపెనీలు అఫిడవిట్లు వేయడం ప్రారంభించాయి.
రాకియా వద్ద పెట్టుబడులు తీసుకుని మోసం
వాన్ పిక్ ప్రాజెక్టు లో రాకియా పెట్టుబడులు పెట్టింది. ఆ పెట్టుబడులను నిమ్మగడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లోకి మళ్లించారు. వైఎస్ చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తాను నిమ్మగడ్డ చేసిన మోసం వల్ల రూ. 2,500 కోట్లు నష్టపోయానని తెలంగాణ హైకోర్టులో రాకియా కేసు వేసింది. ఆగస్టు 30, 2019న సెర్బియా లో ప్రసాద్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రాకియా ఫిర్యాదు మీద ఇంటర్‌పోల్ సహాయంతో జరిగింది. కరోనా వల్ల ఖైదీలందర్నీ విడుదల చేయడంతో ఆయన బయటకు వచ్చారు.
డబ్బులు చెల్లించాలని యూఏఈ కోర్టు ఆదేశాలు
రాకియాకు ప్రసాద్ రూ. 600 కోట్లు చెల్లించమని UAE కోర్టు ఆదేశించింది. కానీ నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ కోర్టులో ఉంది. విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రసాద్ ఆస్తులు బినామీల పేరు మీదకు మళ్లిస్తున్నారనే కంటెంప్ట్ కేసు కూడా ఉంది. అసలు చెల్లించాల్సినవి చెల్లించకుండా పెట్టుబడి పెట్టిన ఓ సంస్థను ఇంతలా దోచుకోవడం జగన్ అండ్ కోకే చెల్లింది. రాకియా అంటే రస్ అల్ ఖైమా దేశం ప్రభుత్వ సంస్థ.
