నిర్భయకు కాదు దోషులకే న్యాయం జరగాలి!!!

సుమారు 28 నెలల క్రితం డిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచార ఘటన చరిత్రలో కలిసిపోయి చాలా రోజులే అయ్యింది. ఒకప్పుడు దానిపై పుంఖాను పుంఖాలుగా కధనాలు ప్రచురించిన మీడియాకి దాని గురించి ఆలోచించే ఆసక్తి, తీరిక రెండూ లేవు. ఆ సంఘటన జరిగినప్పుడు చాలా వీరావేశంతో ఊగిపోయిన ప్రజలు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వారిని చూసి హడావుడి చేసిన ప్రభుత్వం కూడా ఆ కేసుని కోర్టులకి అప్పగించేసి చేతులు కడిగేసుకొంది. కనుక అప్పుడప్పుడు దాని గురించి ఇలాగ వార్తలు వినడమే తప్ప, ఆ దారుణానికి పాల్పడిన దోషులకు శిక్షపడినట్లు లేదా వేయబోతున్నట్లు ఎన్నడూ వార్తలు చూడలేదు. అదే మన దేశంలో వ్యవస్థల గొప్పదనం.

ఆ నేరానికి పాల్పడిన వారిలో మిగిలిన అందరి కంటే అత్యంత పాశవికంగా ప్రవర్తించిన బాలనేరస్తుడు మూడేళ్ళ నిర్బంధం తరువాత బాలనేరస్థుల గృహం నుంచి కొన్ని నెలల క్రితమే విడుదలయి బయటకి వెళ్లిపోయాడు. అతను మళ్ళీ జీవితంలో స్థిరపడేందుకు వీలుగా డిల్లీ ప్రభుత్వం అతనికి రూ. 10, 000 నగదు, కుట్టు మిషన్ వగైరా ఇచ్చినట్లు వార్తలు వచ్చేయి. సమాజం వలన అతనికి ఎటువంటి నష్టమూ, ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంది. కనుక ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కనుక అతనికి పూర్తి న్యాయం జరిగినట్లే భావించవచ్చును.

ఇంకా వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్, ముకేష్ మరియు పవన్ గుప్తా అనే మరో నలుగురు దోషులకు, ఆ కేసును విచారిస్తున్న ఫాస్ట్-ట్రాక్ కోర్టు సెప్టెంబర్ 2013 లో ఉరి శిక్షలు వేసినా, వాటిని డిల్లీ హైకోర్టు నిలిపివేసింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా వారి కేసుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీసుకొన్న తాజా నిర్ణయంతో అది ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం కూడా లేదని స్పష్టం అవుతోంది.

“వందమంది దోషులు శిక్ష పడకుండా తప్పించుకొనిపోయినా పరువాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా పొరపాటున శిక్షపడకూడదనే,’ ఫార్ములాని చాలా నిబద్దతో పాటిస్తున్న సుప్రీం కోర్టు, ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడిన ‘ఆ నలుగురు’ తరపున బలంగా వాదించేందుకు మంచి సమర్దులయిన న్యాయవాదులు లేకపోవడం వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించి, వారికోసం రాజు రామచంద్రన్ మరియు సంజయ్ హెగ్డే అనే ఇద్దరు సీనియర్ న్యాయవాదులను నియమిస్తున్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ వి.గోపాల గౌడ, మరియు జస్టిస్ కురియన్ జోసఫ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా గుర్తించిన ఆ నలుగురికి న్యాయం జరిగేందుకు తాము తీసుకొన్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది. ఈ కేసు విచారణను జూలై 18కి వాయిదా వేసింది. అంటే సుమారు మరో నాలుగు నెలలు ఆ నలుగురు నిశ్చింతగా ఉండవచ్చన్నమాట. ఆ తరువాత కూడా వారి తరపున ఇద్దరు సీనియర్ న్యాయవాదులు వాదించబోతున్నారు కనుక ఈ కేసు మారో నాలుగయిదేళ్ళు సాగినా ఆశ్చర్యం లేదు.

ఈ కేసులో అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేయబడి, అంతకంటే భయానకంగా హత్యచేయబడిన ‘నిర్భయ’కు మన చట్టాలు, న్యాయస్థానాలు న్యాయం చేయలేకపోయి ఉండవచ్చును. కానీ ఆమెపై ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురికి న్యాయం చేయకుండా ఉండలేమని స్పష్టం చేస్తున్నాయి. గ్రేట్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close