ఓటీటీకి ఓటు వేయ‌ని నితిన్‌!

వి… ఓటీటీలో విడుద‌లైంది. నిశ్శ‌బ్దం, ఓరేయ్ బుజ్జిగా రెండూ అదే బాట ప‌ట్టాయి. నితిన్ సినిమా `రంగ్ దే` కూడా ఓటీటీలోనే విడుద‌ల అవుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జీ 5 ఈ సినిమా హ‌క్కుల కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే నితిన్ మాత్రం ఓటీటీకి `నో` చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. ఓటీటీ ఫ‌లితాలు సానుకూలంగా లేక‌పోవ‌డం, త్వ‌ర‌లోనే థియేట‌ర్లు తెర‌చుకునేందుకు పుష్క‌లంగా అవ‌కాశాలు ఉండ‌డంతో నితిన్ అడ్డు చెబుతున్న‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు జీ 5తో బేరం కూడా అంత ఈజీగా తెగేట్టు క‌నిపించ‌డం లేదు. `రంగ్ దే` హ‌క్కుల రూపంలో నిర్మాత‌లు ఏకంగా 40 కోట్ల వ‌ర‌కూ కోడ్ చేసిన‌ట్టు తెలుస్తోంది (ఓటీటీ, శాటిలైట్ రెండూ క‌లిపి). కానీ జీ 5 మాత్రం 28 కోట్లు ఇస్తానంటోంద‌ట‌. రెండింటికీ పెద్ద మార్జినే ఉంది. కాబ‌ట్టి బేరం తెగే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దాంతో పాటు… `రంగ్ దే` షూటింగ్ ఇంకా బాకీ ఉంది. త్వ‌ర‌లోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకోవ‌డానికి ఇట‌లీ వెళ్ల‌బోతోంది చిత్ర‌బృందం. అక్క‌డికి వెళ్లి, వ‌చ్చాక‌… పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలూ పూర్త‌య్యాక – అప్పుడు ఓటీటీ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంది. ఈలోగా థియేట‌ర్లు తెర‌చుకుని, వాతావ‌ర‌ణం అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌న్న‌ది నితిన్ న‌మ్మ‌కం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలవరం కట్టలేమన్న అనిల్..!

పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రం ఆమోదించిన పాత ధరలకు తాము కట్టలేమని.. జనవనరుల మంత్రి అనిల్ కుమార్ మీడియా ముందు తేల్చి చెప్పేశారు. సహాయ, పునరావాసాలకే...
video

ఆకాశం నీ హ‌ద్దురా ట్రైల‌ర్‌:  క‌ల‌ల‌కు రెక్క‌లొచ్చాయి

ఓ సామాన్యుడు. ఫ్లైట్ టికెట్ కూడా కొన‌డానికి డ‌బ్బుల్లేని వాడు, ఏకంగా.. విమానాల వ్యాపార‌మే పెడ‌తానంటే..?  పెట్టి చూపిస్తే..?  ఈ వ్యాపారంలో దిగ్గ‌జాలుగా చ‌లామ‌ణీ అవుతున్న ఎంద‌రినో త‌న వ్యూహాల‌తో కుదేలు చేస్తే..?...

రాజధాని, పోలవరం కట్టేశారు.. ఇక విశాఖ మెట్రో..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అధికారం చేపట్టి.. ఏడాదిన్నర దాటిపోయింది. ఈ లోపులో అమరావతి, పోలవరం కట్టేశారు. ఇప్పుడు విశాఖ మెట్రో కట్టడానికి టెండర్లు పిలవడానికి సిద్ధమవుతున్నారు. మంత్రుల ప్రకటనలు ఇలానే ఉన్నాయి....

ప్రజలతో సంబంధం లేకుండా ఏపీ బీజేపీ బలపడుతుందా..?

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీలో బీజేపీ బలపడుతుందని.. ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా ప్రసంగించారు. అంత వరకూ బాగానే...

HOT NEWS

[X] Close
[X] Close