ఛల్ మోహ‌న్‌రంగ.. నితిన్ సేఫ్ జోన్!

ఫ్లాపుల మారథాన్‌లో పరుగులు పెట్టిన నితిన్‌ని హిట్ ట్రాక్ ఎక్కించినవి ప్రేమకథలే. హిట్ ట్రాక్‌లో ఉండగా చేసిన యాక్షన్ ఎక్స్‌ప‌రిమెంట్‌ ‘లై’ ప్లాప్ అయ్యింది. ఆ సినిమా తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఈ రోజు ప్రకటించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘ఛల్… మోహ‌న్‌రంగ’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. హీరోగా నితిన్‌కి 25వ సినిమా ఇది. ఫస్ట్ లుక్ స్టిల్స్ చూస్తుంటే చక్కటి అందమైన ప్రేమకథా చిత్రంగా అనిపిస్తుంది. తనకు బాగా సూట్ అయిన, హిట్స్ వచ్చిన సేఫ్ జోన్ లో నితిన్ ఈ సినిమా చేసినట్టు ఉన్నాడు.

ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా టీజర్,ఏప్రిల్ 5న సినిమా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ఆ ఒక్క పాటను ఈ నెల 14 నుంచి హైదరాబాద్;లో షూట్ చేస్తారట. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. ‘లై’, ఇప్పుడు ‘ఛల్… మోహ‌న్‌రంగ’… బ్యాక్ టు బ్యాక్ నితిన్ ఈ అమ్మాయితో సినిమాలు చేస్తున్నాడు. నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మూల కథను అందించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close