‘సైతాన్‌’ గెట‌ప్పులో నితిన్‌

నితిన్ – వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. శ్రీ‌లీల హీరోయిన్‌. ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకొంటుంది. మ‌ధ్య‌లో చిన్న చిన్న బ్రేకులు తీసుకొన్నా – ఇప్పుడు ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు నితిన్‌. ఎందుకంటే నితిన్ కొత్త‌గా రెండు ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడు. ఓ సినిమా వెంకీ కుడుముల‌తో చేస్తున్నాడు. ఇందులో ర‌ష్మిక హీరోయిన్‌. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. మ‌రోవైపు వేణు శ్రీ‌రామ్ చెప్పిన క‌థ‌కూ నితిన్ ఒప్పుకొన్నాడ‌ని టాక్‌. వ‌క్కంతం వంశీ సినిమా పూర్తి చేస్తే త‌ప్ప‌… ఈ రెండు సినిమాల్ని మొద‌లెట్ట‌డానికి లేదు. ఎందుకంటే వ‌క్కంతం సినిమాలో నితిన్ గెట‌ప్ చాలా డిఫ‌రెంట్ గా ఉండ‌బోతోంది. మ‌ధ్య‌లో మ‌రో సినిమా చేస్తే.. గెట‌ప్పుల్లో తేడా వ‌స్తుంది. అందుకే ముందు వ‌క్కంతం సినిమాపై ఫోక‌స్ పెట్టాడు.

ఈ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కూ టైటిల్ ఖ‌రారు కాలేదు. `జూనియ‌ర్‌`, `ఎంట‌ర్‌టైన‌ర్‌` అనే రెండు పేర్లు య‌ట‌కు వ‌చ్చాయి. కానీ అవి రెండూ కేవ‌లం వ‌ర్కింగ్ టైటిల్సే. ఇప్పుడు `సైతాన్‌` అనే మ‌రో పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఇది కూడా ఖ‌రారు కాదు. కేవ‌లం అనుకొంటున్నారంతే. ఈ సినిమాలో నితిన్ రెండు వేర్వేరు గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్నాడు. అందులో ఓ పాత్ర‌కు `సైతాన్‌` అనే పేరుంది. దాన్నే సినిమా టైటిల్ గా పెడితే బాగుంటుంద‌న్న‌ది వంశీ ఆలోచ‌న‌. కాక‌పోతే… అధికారికంగా మాత్రం ఖ‌రారు చేయ‌లేదు. సినిమా పూర్త‌వ్వడానికి ఇంకా టైమ్ ఉంది కాబ‌ట్టి.. ఈలోగా మ‌రో మంచి పేరు త‌డితే.. దాన్నే ఫైన‌ల్ చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close