‘హీరో’ని కాద‌న్న నితిన్‌?

ఈ సంక్రాంతి సినిమాల్లో `హీరో` ఒక‌టి. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతోనే అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్యాడింగ్ బాగానే ఉంది. బాగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్టు అర్థం అవుతోంది. కౌబోయ్ కి సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌.

ఈ క‌థ చాలామంది యంగ్ హీరోల ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ముఖ్యంగా నితిన్ తో ఈ సినిమా చేద్దామ‌నుకున్నాడ‌ట శ్రీ‌రామ్ ఆదిత్య‌. అందుకు సంబంధించిన డిస్క‌ర్ష‌న్లు కూడా జ‌రిగాయి. కానీ అటు తిరిగి ఇటు తిరిగి గ‌ల్లా అశోక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. సినిమా హీరో అవ్వాల‌ని క‌లలు క‌నే ఓ కుర్రాడి క‌థ‌. అది అవ్వ‌క‌పోగా.. ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో చిక్కుకుంటాడు. అదెలా జ‌రిగింద‌న్న‌ది స‌స్పెన్స్‌. ఈ సినిమాలో సినిమాల‌కు సంబంధించిన ఓ ట్రాక్ ఉంద‌ట‌. అది చాలా హిలేరియ‌స్ గా వ‌చ్చింద‌ని, ఈ సినిమా విడుద‌ల‌య్యాక‌.. అది టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ అవ్వ‌బోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుందో? దేని గురించో తెలియాలాంటే కొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close