నితిన్ తెలివే తెలివి

నితిన్‌లో ఓ నిర్మాత ఉన్నాడు. శ్రేష్ట్ మూవీస్ సంస్థ త‌న‌దే. చేతిలో నిర్మాణ సంస్థ ఉండ‌డం నితిన్‌కి బాగా కలిసొచ్చింది. ఈ బ్యాన‌ర్ పై చేసిన సొంత సినిమాల‌న్నీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇప్పుడు వ‌రుస‌గా రెండు సినిమాల్ని త‌న బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాడు. `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` సినిమా సెట్స్‌పై ఉంది. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ సినిమా ఒప్పుకొన్నాడు. ఆమ‌ధ్య క్లాప్ కొట్టుకొంది. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్‌. ఇప్పుడు షూటింగ్ కూడా మొద‌లైపోయింది. విదేశాల్లో ఓ పాట పూర్తి చేసుకొచ్చింది వ‌క్కంతం టీమ్‌.

ఇట‌లీలో `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అక్క‌డ ఈ సినిమాకి సంబంధించి 3 పాట‌లు తెర‌కెక్కించాలి. మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఈ ఖాళీ స‌మయాన్ని కూడా ఉప‌యోగించుకోవాల‌న్న ఉద్దేశంతో వ‌క్కంతం సినిమాకి సంబంధించిన ఓ పాట‌ని అక్క‌డ ఫినిష్ చేసేశాడు. శ్రీ‌లీల‌, వ‌క్కంతం వంశీ, డాన్స్ మాస్ట‌ర్‌, కెమెరామెన్‌లు మాత్ర‌మే ఇండియా నుంచి వెళ్లారు. మిగిలిన‌దంతా… `మాచ‌ర్ల‌` టీమే. అలా.. ఒక దేశంలో, ఒకే యూనిట్‌తో.. రెండు సినిమాల‌కు సంబంధించిన పాట‌ల్ని పూర్తి చేశాడు నితిన్‌. ఈ రెండు సినిమాల‌పై నితిన్ చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు నితిన్‌. `మాచ‌ర్ల‌` ఫుల్ మాస్ సినిమా అయితే, వ‌క్కంతం వంశీది పూర్తి వినోదాత్మ‌క చిత్రం. `కిక్‌`, `రేసుగుర్రం` స్థాయిలో వ‌క్కంతం వంశీ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. `మాచ‌ర్ల‌` పూర్త‌యిన వెంట‌నే వ‌క్కంతం వంశీ సినిమాకి పూర్తి స్థాయి స‌మ‌యం కేటాయించ‌బోతున్నాడు నితిన్‌. త్వ‌ర‌లోనే `మాచ‌ర్ల‌` టీమ్ ఇండియాకి తిరిగొస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చరిత్ర సృష్టించిన ఆటా

అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారి తో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో...

రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది వారికి రాజ్యసభ పదవులు !

దక్షిణాది నుంచి నలుగురు సినిమా, స్పోర్ట్స్ , అధ్యాత్మిక రంగ ప్రముఖులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఈ నలుగురు పేర్లను ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ...

చేరే వాళ్లంతా కాంగ్రెస్ వైపే – బీజేపీపై నమ్మకం లేదా ?

భారతీయ జనతా పార్టీ అతి కష్టం మీద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఒప్పించి పార్టీ కండువా కప్పారు. ఆయన మాస్ లీడర్ కాదు. కానీ ఆయనకు గుర్తింపు ఉంది....

“సాక్షి” : పార్టీ నేతల ప్రకటనల విరాళాలూ వందల కోట్లలోనే !

ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి మీడియాకు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న వందల కోట్ల ధనం ప్రకటనల రూపంలో తరలిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రకటనలకు తోడు.. సాక్షి పత్రికను కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close