‘రంగ్ దే’ టీజ‌ర్‌: పెళ్లైతే బ‌తుకే బ‌స్టాండే!

భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌రూ.. భ‌ర్త‌గ మార‌కు బ్యాచిల‌రు – అంటూ ఓ పాటేసుకున్నాడు కోట శ్రీ‌నివాస‌రావు. `రంగ్‌దే`లో అర్జున్ (నితిన్‌) అభిప్రాయం కూడా అదే. పెళ్లైతే బ‌తుకే బ‌స్టాండ్ అని ఫీల‌వుతుంటాడు. కాక‌పోతే… అనుకోకుండా అను (కీర్తి సురేష్‌)ని పెళ్లి చేసుకోవాల్సివ‌స్తుంది. ఆ త‌ర‌వాత ఏం జ‌రిగిందో తెలియాలంటే ‘రంగ్ దే’ చూడాల్సిందే. నితిన్ – కీర్తి జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. నితిన్ పెళ్లి సంద‌ర్భంగా చిత్ర బృందం పెళ్లి కానుక‌గా ఈ టీజ‌ర్ ని విడుద‌ల చేసింది. టీజర్ అంతా పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ‘వీడే నా బాయ్ ఫ్రెండ్‌’ అని ఫిక్స‌యిపోయిన ఓ అమ్మాయి… ‘త‌ను నా గాళ్ ఫ్రెండ్ కాదు’ అని త‌ప్పించుకుని తిరిగే అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సివ‌స్తే ఏం జ‌రిగింద‌న్న‌దే క‌థ‌. దీన్నో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించాడు వెంకీ. నితిన్ – కీర్తిల కెమిస్ట్రీ, ఫ‌న్‌, దేవిశ్రీ సంగీతం వ‌ర్క‌వుట్ అయితే.. సినిమా హిట్ట‌యిన‌ట్టే. ఈ సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేస్తాం అని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ‘హోప్ ఫుల్లీ’ అంటూ… ఓ ష‌ర‌తు పెట్టింది. క‌రోనా క‌ష్టాల‌న్నీ తొల‌గిపోయి, అంతా స‌వ్యంగా అయిపోతే.. ఈ సంక్రాంతి బ‌రిలో రంగ్ దే నిలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.