నితిన్ నిత్యాలు మళ్లీ కలుస్తున్నారు

నితిన్, నిత్యా మీనన్ ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న వార్తలు ఫిల్మ్ నగర్ లో జోరందుకున్నాయి. పదికి పైగా ఫ్లాప్ సినిమాలతో కెరియర్ లో ఆటు పోట్లు ఎదుర్కున్న నితిన్ కు ఇష్క్ సినిమా ద్వారా హిట్ అందించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇక ఆ సినిమాలో నితిన్, నిత్యాల జంట సూపర్ అనిపించుకుంది. అయితే ఆ సినిమా తర్వాత ఆ క్రేజీ కాంబినేషన్ లో మళ్లీ గుండెజారి గల్లంతయ్యిందే సినిమా వచ్చింది.

విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఆ సినిమా కూడా నితిన్ కు భారీ విజయాన్ని అందించింది. అయితే మరోసారి వీరిద్దరు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడుగా విజయ్ కుమార్ పనిచేయడం విశేషం. కొరియర్ బోయ్ కళ్యాన్ సినిమా ఫ్లాప్ తో మళ్లీ ట్రాక్ తప్పేలా ఉన్న నితిన్ ప్రస్తుతం అ..ఆ సినిమా చేస్తున్నాడు.

త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్ అవుతుంది. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ కుమార్ దర్శకత్వంలో నితిన్, నిత్యాల సినిమా ఉంటుందట. మరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మరో భారీ హిట్ ను అందుకోవాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close