అఫీషియ‌ల్‌: నితిన్‌తో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి

నితిన్ జోరుమీదున్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ సినిమా చేయాలి. దాంతో పాటు ర‌మేష్ వ‌ర్మ చెప్పిన క‌థ‌ని ఓకే చేశాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఈరోజే వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. భ‌వ్య ఆర్ట్స్ సంస్థ నితిన్ హీరోగా ఓ సినిమాని రూపొందిస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మ‌రి వెంకీ కుడుముల సినిమాని ఎప్పుడు మొద‌లెడ‌తాడో చూడాలి.

మైత్రీ మూవీస్ లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఓ సినిమా చేయ‌డానికి గ‌త యేడాదిగా ప్ర‌య‌త్నిస్తూనేఉన్నారు. అయితే హీరో సెట్ అవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. అందుకే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మైత్రీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. నితిన్‌తో ఓ సినిమా చేయాల‌ని భ‌వ్య క్రియేష‌న్స్ ఎప్ప‌టి నుంచో అనుకుంటుంది. ఆ ప్రాజెక్టు ఇలా సెట్ట‌య్యింద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com