మరో ఇద్దరు సీనియర్ల పనైపోయిందని సంకేతాలిచ్చిన మోదీ, షా !

బీజేపీలో మరో ఇద్దరు సీనియర్లకు పొగ పెట్టేశారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌లను బీజేపీ అత్యున్నత కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. ఇక పార్లమెంటరీ బోర్డులో మిగిలిన సీనియర్ ఒకే ఒక్కరు.. రాజ్ నాథ్ సింగ్. ఆయన కాకుండా ఉన్నది అమిత్ షా, మోదీ మాత్రమే. ఇక అధ్యక్షుడిగా ఉన్నందుకు జేపీ నడ్డా ఉంటారు. మిగిలిన వారంతా.. మోదీ, అమిత్ షా ప్రాపకంతో పైకొచ్చినవారే. వారంతా తలూపడానికే ఉంటారు. ఇటీవలే రాజ్యసభ టిక్కెట్ ఇచ్చి ఎంపీని చేసిన లక్ష్మణ్‌కు కూడా చోటిచ్చారు.

కానీ గడ్కరీ , చౌహాలను మాత్రం పక్కన పెట్టేశారు. అద్వానీ, వాజ్ పేయి హయాంలో కీలకమైన నేతలందర్నీ దాదాపుగా సైడ్ చేసేశారు. ఇక చివరి విడతగా రాజ్ నాథ్ సింగ్ మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మోడీ, షాలు మాత్రం మిగులుతారు. బీజేపీలో 75 ఏళ్లు వచ్చిన నేతలకు చోటు లేదని చెబుతూ ఉంటారు. అయితే ఆ నిబంధన మోదీ, అమిత్ షాలకు వర్తిస్తుదో లేదో స్పష్టత లేదు. అదే్ సమయంలో ఎన్నికల కమిటీని కూడా పునర్ వ్యవస్థీకరించారు. ఇందులోనూ ఆ సీనియర్లకు చోటు దక్కలేదు.

ఎన్నికల కమిటీ ఎప్పుడు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ కమిటీలోనూ తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ లక్ష్మణ్‌కు చోటిచ్చారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు మాత్రం చోటు దక్కలేదు. ముఖ్యమంత్రి పదవుల నుంచి తప్పించిన యడ్యూరప్ప, షర్బానంద సోనోవాల్ వంటి నేతలకు చోటిచ్చారు. బీజేపీలో ఎప్పటికప్పుడు కొంత మంది సీనియర్లను పక్కన పెడుతూ ఉంటారు. ఆ ప్రకారం ఇప్పుడు నితిన్ గడ్కరీ, చౌహాన్ వంతు వచ్చిందేమోనన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close