ఖైదీ నెం.150… మెగా అభిమానులతో పాటు, టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఇటీవలే టీజర్‌ని విడుదల చేశారు. అమ్మడూ… కుమ్ముడూ అంటూ ఓ పాటని రేపు (ఆదివారం) ఆన్ లైన్లో పెట్టేస్తారు. ఆడియో ఫంక్షన్ క్రిస్మస్ రోజున, విజయవాడలో నిర్వహిస్తారని చరణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఖైదీ అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. ఆడియో ఫంక్షన్ జరపకుండా.. నేరుగా పాటల్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగా కాంపౌండ్ నుంచి ఇటీవల వచ్చిన సరైనోడు, ధృవ సినిమాలకు ఇలానే పాటల్ని నేరుగా విడుదల చేశారు. ఆ తరవాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. సేమ్ టూ సేమ్ అదే ఫార్ములా ఖైదీ నెం.150 కీ అప్లై చేయాలన్నది చిత్రబృందం వ్యూహం.
క్రిస్మస్ రోజున ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని కసరత్తులు చేసుకొంది చిత్రబృందం. విజయవాడలోని వేదికగా ఎంచుకొన్నారు. మరి అంతలోనే ఏమైందో.. సడన్‌గా ప్లాన్ మరిపోయింది. అన్నయ్య ఆడియో ఫంక్షన్‌కి తమ్ముడ్ని పిలుస్తారా, పిలిస్తే వస్తాడా, లేదా అంటూ ఆసక్తిగా మెగా అభిమానులు చర్చించుకొంటున్నారు. పవన్ వస్తే ఫర్వాలేదు. రాకపోతేనే మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ మరింతగా ముదిరే అవకాశం ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఆడియో ఫంక్షన్ లేకుండా చేశారా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ నాటికైనా సేమ్ టూ సేమ్ ఇదే సమస్య వస్తుంది కదా? అప్పుడు పవన్ రాకపోతే ఇలాంటి చర్చలే జరుగుతాయి కదా? సో.. ఆడియో ఫంక్షన్ లేకపోవడానికి పవన్ కారణం కాకపోవొచ్చన్నమాట. ప్రస్తుతం మోగా ఫ్యాన్స్ అనుసరిస్తున్న ట్రెండ్‌నే తాను ఫాలో అవ్వాలని చిరు నిర్ణయం తీసుకొని ఉంటాడు. పైగా.. సరైనోడు, ధృవ హిట్ అయ్యాయి కాబట్టి.. ఆ సెంటిమెంట్ తనకీ వర్కవుట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడేమో. మొత్తానికి మెగా హీరోలందరినీ ఒకే చోట చూడాలన్న చిరు ఫ్యాన్స్ కోరిక తీరడానికి ఇంకొంచెం సమయం పట్టేట్టే ఉంది.