కాంట్రవర్సీ: బీఫ్, పోర్క్ డెలివరీ చేయలేమంటూ జొమాటో డెలివరీ బాయ్స్ స్ట్రైక్

జొమాటో సంస్థ మరొక వివాదంలో చిక్కుకుంది. కోల్ కతా లోని జొమాటో డెలివరీ బాయ్స్ తాము బీఫ్, పోర్క్ లాంటి ఆహారాన్ని డెలివరీ చేయలేమని అది తమ మత విశ్వాసాలకి వ్యతిరేకమని నినదిస్తూ రేపటినుండి సమ్మె చేయనున్నారు. వెస్ట్ బెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ కూడా వర్కర్ల పక్షాన నిలబడుతూ సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అక్కడి సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే..

జొమాటో యాప్, ఇటీవలి కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన ఫుడ్ డెలివరీ యాప్. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా, రేపటి బక్రీద్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, బీఫ్ వండే కొన్ని హోటళ్లను కొత్తగా జొమాటో కి అనుసంధానం చేశారు. అయితే, తాము బీఫ్ సరఫరా చేయలేమని ఇందు లో పనిచేసే కొంతమంది హిందూ డెలివరీ బాయ్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో పోర్క్ చేసే హోటల్స్ ని కూడా జొమాటో కి అనుసంధానం చేశారు. పోర్క్ డెలివరీ చేయడానికి ముస్లిం డెలివరీ బాయ్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు హిందూ యువకులు ఇటు ముస్లిం యువకులు, ఇద్దరూ కూడా తాము బతుకు తెరువు కోసం ఈ సంస్థలో పని చేసే మాట వాస్తవమే అయినప్పటికీ అందుకోసం తమ మత విశ్వాసాలని పణం గా పెట్టలేమంటూ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో వెస్ట్ బెంగాల్ లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం లోని మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే ఆయన కూడా వర్కర్ల పక్షానే నిలబడడంతో వివాదం పెద్దగా అయ్యింది.

అయితే ఇటీవలి కాలంలో జోమాటో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సంస్థ డెలివరీ బాయ్ తాను డెలివరీ చేయాల్సిన ఆహారాన్ని దారి మధ్యలో ఎంగిలి చేసిన వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక గత వారం సంస్థ ట్యాగ్ లైన్ ” ఆహారమే మా మతం” కూడా సోషల్ మీడియాలో వివాదాలకు దారి తీసింది. అయితే వాటితో పోలిస్తే ఇప్పుడు ఏర్పడిన వివాదం మరింత పెద్దదిగా కనిపిస్తోంది. మరి ఈ సమస్యను జోమాటో ఏ విధంగా పరిష్కరించుకుంటుందో, రేపటి సమ్మె ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను.. అలా మాట్లాడింది నేనే : ఈశ్వరయ్య

హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సస్పెండైన న్యాయమూర్తి రామకృష్ణతో ఆరోపణలు చేయించడానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య కుట్ర చేసినట్లుగా ఆరోపణలకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. రామకృష్ణ హైకోర్టుకు సమర్పించిన ఆడియో టేప్......

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

HOT NEWS

[X] Close
[X] Close