ఈవారం బాక్సాఫీసు ఖాళీ!

సెప్టెంబ‌రు 15న రావాల్సిన స్కంధ‌… నెలాఖ‌రుకి వాయిదా ప‌డ‌డంతో.. ఈవారం బాక్సాఫీసు అనూహ్యంగా ఖాళీ అయిపోయింది. ఒక‌ట్రెండు సినిమాలు మిన‌హా.. పెద్ద‌గా ఆక‌ర్షించే విష‌యాలేం లేవు. విశాల్ మార్క్ ఆంటోనీ, ర‌వితేజ నిర్మాత‌గా తెర‌కెక్కించిన ఛాంగురే బంగారు రాజా.. రెండు సినిమాలు బాక్సాఫీసు బ‌రిలో నిలిచాయి. ఛాంగురే.. వ‌చ్చే నెల‌లో రావాల్సింది. స్కంద వాయిదా ప‌డ‌డంతో.. ముందుకొచ్చేసింది. విశాల్.. రిలీజ్‌డేట్ ముందే ఫిక్స‌య్యింది. సోమ‌వారం వినాయ‌క చ‌వితి. ఈ పండ‌గ‌ను… విశాల్ సినిమా క్యాష్ చేసుకొనే అవ‌కాశం ఉంది. గ‌త‌వారం విడుద‌లైన మిస్ శెట్టి- మిసెస్ పోలిశెట్టికి ఈ వారం కూడా క‌లిసొచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా `ప‌ఠాన్‌`కి మ‌రో వీకెండ్ దొరికిన‌ట్టైంది. తెలుగు రాష్ట్రాల‌లో ప‌ఠాన్‌కి మంచి వ‌సూళ్లే దక్కుతున్నాయి. చాలా ఏరియాల్లో అనుష్క సినిమా కంటే.. ప‌ఠాన్‌కే ఎక్కువ టికెట్లు తెగుతున్నాయి. ఈ వారం కూడా అదే జోరు కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close