చైతన్య : వేటాడే ప్రభుత్వాలున్నప్పుడు సెలబ్రిటీలు నోళ్లెలా తెరుస్తారు..?

స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదుంటూ.. కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలపై… సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కానీ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికాలోని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ దగ్గర్నుంచి తమిళనాడులోని జల్లి కట్టు వరకూ టాలీవుడ్ స్టార్స్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన మాత్రమే స్పందించరు. దీనికి కారణం… ఉంది. అదే భయం. ప్రభుత్వాలు టార్గెట్ చేస్తాయనే భయం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే స్టార్లు ప్రశాంతంగా ఉండగలరా..!?

టాలీవుడ్ స్టార్స్‌ది స్పందించకుండా ఉండే రాయి లాంటి మనస్థత్వం కాదు. తమకు స్టార్లు చేసిన ప్రజల పట్ల వారికి ఎంతో కొంత అభిమానం ఉంటుంది. వారిసమస్యల్లో పాలు పంచుకోవాలని అనుకుంటారు. కానీ వారు తమ అభిప్రాయాలను బయటకు చెప్పకుండా అణగదొక్కుకుంటున్నారు. ఎందుకంటే వారికి తాము కొంత మందికి వ్యతిరేకం అవుతామనే భావన. జాతీయ.. అంతర్జాతీయ అంశాలపై స్పందించడం వేరు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై స్పందించడం వేరు. ఇక్కడ అమరావతికి మద్దకు తెలిపితే.. ప్రభుత్వానికి టార్గెట్ అవుతామనే భయం వారికి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపితే.. కేంద్రానికి టార్గెట్ అవుతామన్న ఆందోళన కూడా ఉంటుంది. అందుకే వారు స్పందించలేకపోతున్నారు.

కులాల వారీగా చీలిపోయిన ప్రజల కోసం రిస్క్ ఎందుకని స్టార్లు అనుకుంటున్నారా..?

ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు వ్యతిరేకంగా ఎవరైనా సెలబ్రిటీలు మాట్లాడితే వారిని వెంటాడుతున్న ఘటనలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన బాలీవుడ్ సెలబ్రిటీలపై ఐటీ దాడులు జరిపి మీడియాలో చేసిన అతి ప్రచారం అంతా ఇంతా కాదు. అలాంటి పరిస్థితులు మాకెందకని టాలీవుడ్ ప్రముఖులు సైలెంట్ గా ఉంటున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇదితెలిసి కూడా.. రైతుల గురించి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారని.. అయితే రైతు సమస్యలపై సైలెంటయ్యారని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమంపైనా అదే పరిస్థితి. రేపు ప్రభుత్వాల నుంచి ఏదైనా కష్టం వస్తే ప్రజలు అండగా ఉండే పరిస్థితిలేదు. కులమతాల ఆధారంగా చీలిపోయిన సమాజం.. ఐక్యతను ఎప్పుడో దూరం చేసింది.అందుకే స్టార్లు కూడా.. తమ జాగ్రత్తను తాము చూసుకుంటున్నారు.

స్పందించలేదని స్టార్లను నిందించడం సరి కాదు..! అది వారిష్టం..!

ప్రభుత్వాలకు భయపడి సైలెంట్‌గా ఉండటం అనేది ఇతర సినీ పరిశ్రమల్లో స్టార్లు చేయరు. తమిళనాడులో విజయ్ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా గళమెత్తుతూనే ఉంటారు. అందుకే ఆయనను దళపతిగా ఫ్యాన్స్ పిలుస్తూంటారు. ఇప్పుడు ఇమేజ్ అనేది.. సినిమాల్లో చేసే పాత్రల ద్వారానే కాదు.. నిజ జీవితంలో ప్రజలకు అండగా నిలబడే శైలిని బట్టి కూడా వస్తోంది. అయితే రాజకీయ ఆకాంక్షలు ఉన్న వారు మాత్రమే.. ఇప్పుడు బయట పడుతున్నారు. రాజకీయాల్లో ఉన్న స్టార్లు.. రాజకీయాల్లోకి రావాలనుకున్న స్టార్లు మాత్రమే.. స్పందిస్తున్నారు. దాని వల్ల.. ప్రయోజనం ఉండటం లేదు. స్పందించని సెలబ్రిటీలు విమర్శలకు గురవుతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close