‘పుష్ష‌’… రిలీజ్ డేట్ మారేదే లే!

ఈ యేడాది విడుద‌ల కానున్న క్రేజీ సినిమాల్లో ‘పుష్ష 2’ ఒక‌టి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘పుష్ష‌’ ఊహించ‌ని విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా, అల్లు అర్జున్ కి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ పుర‌స్కారాన్ని తీసుకొచ్చింది. దాంతో… ‘పుష్ష 2’పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోయాయి. 2023లోనే ఈ సినిమా విడుదల కావాలి. కానీ… స్క్రిప్టు విష‌యంలో రాజీ ప‌డ‌క‌పోవ‌డంతో 2024 ఆగ‌స్టు 15కి వెళ్లింది. అయితే ఆగ‌స్టు 15న కూడా ఈ సినిమా విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మ‌ని, వాయిదా ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయంటూ ఈమ‌ధ్య వార్త‌లు వినిపించాయి. వాటిపై చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఆగ‌స్టు 15నే వ‌స్తామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

‘మ‌రో 200 రోజుల్లో పుష్ష‌గాడి రూల్ మొద‌లు.. ‘అంటూ ఓ పోస్ట‌ర్ ని ఈరోజు విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 15కి మ‌రో 200 రోజులే ఉన్నాయి. సో.. చెప్పిన స‌మ‌యానికి పుష్ష 2 రావ‌డం ప‌క్కా అయ్యింద‌న్న‌మాట‌. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఓ కీల‌క షెడ్యూల్ పూర్తి చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇప్ప‌టికే పాట‌ల‌న్నీ ఇచ్చేసిన‌ట్టు స‌మాచారం. టీ సిరీస్ ఆడియో రైట్స్‌ని దాదాపుగా రూ.60 కోట్ల‌కు సొంతం చేసుకొంద‌ని టాక్‌. తెలుగు సినీ చ‌రిత్ర‌లో, ఓ సినిమాకి ఈ స్థాయిలో ఆడియో రైట్స్ ద‌క్క‌డం ఓ రికార్డ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close