కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు ఉంటే.. ఇంత సమస్య ఎందుకు అన్నట్లుగా. . అధికారులు కూడా.. ప్రభుత్వంతో మాట్లాడి ఇస్తామని.. వాదనలకు పులిస్టాప్ పెట్టారు. రెండు రాష్ట్రాలు చేసుకున్న పరస్పర ఫిర్యాదులపై ఆరు గంటల పాటు చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని.. ఉమ్మడి రాష్ట్రంలో జారి చేసిన జీవోలను ..తెలంగాణ అధికారి రజత్ కుమార్ తీసుకు వచ్చారు. ఆ జీవోలను ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరిగా ఉన్న ఆదిత్యనాథ్ దాసే ఇచ్చారు.

ఇప్పుడు ఆయన ఏపీ తరపున కేఆర్ఎంబీ భేటీకి వచ్చారు. ఆ జీవోలను చూపి రజత్ కుమార్.. ఆదిత్యనాథ్ దాస్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆదిత్యనాథ్ దాస్.. రజత్ కుమార్ వాదనను…ఆదిత్యనాథ్ దాస్ తోసిపుచ్చారు. ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రతిపాదనలకు… వీటికి పొంతన లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందని .. అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాల్సిందేనని డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం జరుగుతోందని వాదించారు. ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే… పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.

అయితే రజత్ కుమార్ మాత్రం.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని .. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి… అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని వాదించారు. అంతా అయిపోయిన తర్వాత అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌ పరమేశం సూచించారు. ప్రభుత్వం అనుమతితో డీపీఆర్‌లు సమర్పిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు హామీ ఇచ్చారు. చివరికి గత ఏడాది మారిదినే నీళ్లు..శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలని నిర్ణయించుకుని సమావేశాన్ని ముగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

టీటీడీ వద్ద రూ. 50 కోట్ల పాత నోట్లు..!

కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని ఎలాగోలా ఇతర వనరుల ద్వారా సమకూర్చుకోవాలనుకుంటున్న టీటీడీ చైర్మన్‌కు.. పాత నోట్లు.. గుట్టల్లా పడి ఉండటం కనిపించాయి. వాటి విలువ రూ. యాభై...

మరో మూడు రోజులు స్టే..! కూల్చివేత.. ఆగితే సాగదు..!

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ఆర్డర్స్‌ను.. హైకోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. కూల్చివేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కాపీని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు స్టే...

మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close