కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వద్ద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. అందరూ బనకచర్ల అంశంపైనే ఈ సమావేశం జరుగుతుందని అనుకుంటూ వస్తున్నారు. అయితే తెలంగాణ మాత్రం ఈ వాదనను మొదట్లోనే తోసి పుచ్చింది. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపిన అజెండాను నిర్మోహమాటంగా తిరస్కరించింది. ఏపీ పంపిన అంశం ఒక్కటే.. అదే బనకచర్ల. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచర్లపై చర్చే అక్కర్లేదని అసలు ఆ టాపిక్ వద్దని.. తాము విడిగా అజెండా పంపింది. కృష్ణా నది నీటి పంపకాలు ప్రాజెక్టులపై చర్చిద్దామని డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఆర్ పాటిల్ తో సమావేశానికి వెళ్తారా లేదా అన్నదానిపై ఇంకా అధికారికంగా స్పష్టతలేదు. షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సి ఉంది.కానీ కేంద్ర. చర్చించాల్సిన జాబితాలో బనకచర్ల పెడితే ఏం చేయాలన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బనకచర్ల అనే ప్రాజెక్టు గురించి చర్చించాల్సిన అవసరం వస్తే.. అది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతుందని .. ప్రస్తుతం అయితే అది ఏపీ ఏ మాత్రం అనుమతుల్లేకుండా కడుతున్న ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
బకనచర్ల అంశంపై సీఎం చంద్రబాబు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో స్పష్టత లేదు. బయటకు మాత్రం కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో నిధులు సమీకరించి కట్టాలన్నఅభిప్రాయంతోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించే పరిస్థితుల్లో లేదు. అందుకే.. పెన్నా గోదావరి అనుసంధాన ప్రాజెక్టు కింద అనుమతులు తెచ్చుకుని ప్రారంభించాలనుకుంటున్నారు. అలా అయితే నిధులు కేంద్రం సమీకరిస్తుంది. కానీ తెలంగాణ నుంచి వస్తున్న వ్యతిరేకతతోనే సమస్యలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కనీసం చర్చలు జరిపే పరిస్థితి కూడా లేదు.