భాజపా చేరినా అభియోగాల నుంచి మినహాయింపు ఉండ‌ద‌ట..!

అధికార పార్టీలోకి ఇత‌ర పార్టీల నాయ‌కుల వ‌ల‌స‌లు ఎందుకు ఉంటాయి..? ఆ నాయ‌కుల‌కు ఆర్థిక అవ‌స‌రాలుండొచ్చు, కేసుల్లాంటివి ఉంటే అధికారం అండ అవ‌స‌రం ఉండొచ్చు. ప్ర‌జాసేవ సేవ కోస‌మే పార్టీ మారుతున్నామ‌ని మైకుల ముందు చెప్తున్నవారి అవ‌స‌రాలేంటో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మౌతూనే ఉంటాయి! తాజాగా భాజ‌పాలో చేరిన న‌లుగురు టీడీపీ ఎంపీలూ ప్ర‌ధాన వ్యాప‌కం వ్యాపారాలే క‌దా! ఎన్నిక‌ల‌కు ముందు కొంత‌మంది ఎంపీల‌పై ఐటీ, ఈడీలు దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలో రాలేదు. కేంద్రంలో మ‌రోసారి భాజ‌పా వ‌చ్చింది. భ‌విష్య‌త్తుపై ఓ అంచ‌నాకి వ‌చ్చి… ఆ న‌లుగురూ పార్టీ మారిపోయారు. దీంతో ఇక‌పై వారి వ్యాపారాల‌పైగానీ, గ‌తంలో ఎదుర్కొన్న అభియోగాల నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భించిన‌ట్టే అనే అభిప్రాయ‌మే అంద‌రికీ ఉంది. కానీ… అలాంటి ర‌క్ష‌ణ‌లేవీ ఒక జాతీయ పార్టీగా భాజ‌పా ఇవ్వ‌ద‌ని అంటున్నారు ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు! అలాంటి డీల్ ఏదీ ఆ న‌లుగురు ఎంపీల చేరిక స‌మ‌యంలో జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు.

భాజపా స‌భ్యులైనా కొత్త‌గా చేరిన‌వారికైనా.. వారు ఎదుర్కొంటున్న అభియోగాల నుంచీ, విచార‌ణ‌ల నుంచి ఎలాంటి మిన‌హాయింపూ ల‌భించ‌ద‌న్నారు జీవీఎల్‌. ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పిన త‌రువాతే, వారు అన్నీ ఒప్పుకున్న త‌రువాతే పార్టీలో చేర్చుకోవ‌డం ఉంటుంద‌ని అన్నారు. రాజ్య‌స‌భ‌లో త‌మ‌కు సంఖ్యాబ‌లం త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి, వారు వ‌స్తామంటే చేర్చుకోవ‌డం జ‌రిగింద‌న్నారు! అంతేకాదు, భాజ‌పాలోకి రావ‌డమంటే ముందుగానే ఈ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు లోబ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని తెలుసుకునే… వారు పార్టీలో చేరార‌న్నారు. ఇత‌ర రాజ‌కీయ పార్టీలో ఇలాంటి నిబ‌ద్ధ‌త ఉండ‌ద‌నీ, వీట‌న్నింటికీ వాళ్లు సిద్ధ‌ప‌డే వ‌చ్చార‌న్నారు జీవీఎల్‌!

ఇదే విష‌యం ముందుగా చెబితే ఆ న‌లుగురు టీడీపీ ఎంపీలూ నిజంగా పార్టీ మార‌తారా..? మేం ఎలాంటి ప్రొటెక్ష‌న్ ఇవ్వం, ఐటీ ఈడీ లాంటి సంస్థ‌ల దాడులు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని ముందే చెప్తే ఏమ‌ని అర్థం? త‌మ‌ని చేర్చుకోవ‌డానికి భాజ‌పా సుముఖంగా లేద‌నే అభిప్రాయ‌మే అవుతుంది! కాబ‌ట్టి, ఎందుకు చేర్చుకున్నారూ ఎందుకు వెళ్లారూ అనే చ‌ర్చే అన‌వ‌స‌రం. అంతెందుకు, పార్టీ మార‌క ముందు, వెన‌క‌… ఎంపీ సుజ‌నా చౌద‌రి వ్యాఖ్య‌లు ఒక్క‌సారి గుర్తు చేసుకుంటే.. భాజ‌పా ఇచ్చిన అభ‌య హస్త‌మేంట‌నేది ఎవ్వ‌రికైనా అర్థ‌మైపోతుంది! దాని మీద ప్ర‌త్యేకంగా జీవీఎల్ వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close