థర్టీ ఇయర్స్ పృధ్వీ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విషయంలో కాస్త అతి చేశాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఓ క్యారక్టర్ వేశాడు పృధ్వీ. అయితే లెంత్ అడ్డురావడంలో పృధ్వీ సీన్ తీసేశారు. దీనిపై చాల ఎమోషనల్ అయిపోయాడు పృధ్వీ. ”చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. నేను నటించిన సన్నివేశాలను తొలగించడం దురదృష్టం. సంక్రాంతి రోజున మా అమ్మ చనిపోయినంత బాధగా వుంది” అని బాగా ఎమోషనల్ అయిపోయాడు.
పృధ్వీ ఇలా కామెంట్ చేసేసరికి ఓ రెండు మీడియా చానళ్ళు కూడా ఈ ఐటెం ను హైలెట్ గా చూపించే ప్రయత్నం చేశాయి. నిజంగా ఇది ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కోట్లుపెట్టి తీసిన సీన్సే కధకు అడ్డువస్తున్నాయని భావిస్తే మరో ఆలోచన లేకుండా తీసిపారేస్తారు చిత్ర రూపకర్తలు. అలాంటిది ఓ సన్నీవేశం తీసియడం పెద్ద మేటర్ కాదు. కాని ఎందుకో పృధ్వీ కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యాడు.
అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగిందో పృధ్వీ సీన్ మళ్ళీ సినిమాలో యాడ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇందులో పృధ్వీ సీన్ వుంది. సీన్ చూసిన తర్వాత పృధ్వీ పాత్రను తీసేయడమే సముచితం అనిపించింది. అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు పృధ్వీ రోల్. ఫన్ను లేదు పంచు లేదు. సెకెండ్ ఆఫ్ లో వున్న వేస్ట్ సీన్స్ లో ఇదొకటి. దీంతో పాటు పోసాని కృష్ణ మురళి పాత్ర కూడా బోర్ కొట్టించింది. ఈ రెండు పాత్రలు కధకు అడ్డోచ్చాయని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ముందు అనుకునట్లుగా పృధ్వీ పాత్రను డిలేట్ చేయడమే కరెక్ట్ అని, మళ్ళీ కలిపి ఒక విధంగా తప్పుచేశారని భావన ఆడియన్స్ లో వస్తుందిప్పుడు.