హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఓ వైపు శివార్లలో చిన్న చిన్న బిల్డర్లు కట్టే అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. కానీ… కాస్త లగ్జరీగా నిర్మించే హై రైజ్ అపార్టుమెంట్లలో మాత్రం డబుల్ బెడ్రూంల వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. త్రిబుల్ బెడ్ రూంల ఎంక్వయిరీలే ఎక్కువగా ఉన్నాయి.
కాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకుని అన్ని సౌకర్యాల ఉన్న అపార్టుమెంట్లలలో కొనాలనుకున్నవారు కనీసం త్రిబుల్ బెడ్ రూంకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంత మంది బిల్జర్లు డబుల్ బెడ్ రూమ్స్ తోపాటు త్రిబుల్ బెడ్ రూమ్స్ కూ ప్రాధాన్యం ఇచ్చి నిర్మించారు. ఇలాంటి చోట్ల చాలా వరకూ డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి. వాటిని అమ్ముకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. విశాలంగా ఉంటున్నా.. . త్రిబుల్ బెడ్ రూం అయితేనే వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
నగర్ ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితం కోరుకుంటున్నారు. కుటుంబసభ్యులు అయినా…. ఎవరి ప్రైవసీ వారికి ఉండాలని అనుకుంటున్నారు. అందుకే కుటుంబసభ్యులు నలుగురు ఉంటే స్థోమత ఉన్న వారు .. త్రిబుల్ బెడ్ రూంకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఎంక్వయిరీలు చాలా తక్కువగా ఉన్నాయని ఓ మాదిరి బిల్డర్లు చెబుతున్నారు. అందుకే కొత్త ప్రాజెక్టులు కట్టే వాళ్లు ఎవరూ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను తమ ప్లాన్లలో ఉంచడం లేదు.