తెలంగాణ‌లో కేసీఆర్‌ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అజెండా ఏదీ..?

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో దేశం ముందు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అజెండా పెడ‌తామ‌న్నారు కేసీఆర్‌. భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌న్నీ ఒక‌టౌతాయ‌నీ, అంద‌రూ క‌లిసి అజెండా త‌యారు చేస్తామ‌నీ, దాని ప్రాతిప‌దిక‌నే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని ఆ మ‌ధ్య కేసీఆర్ చెప్పారు. అదే ప‌ని మీద కొన్ని రాష్ట్రాలు తిరిగారు, చివ‌రికి త‌త్వం బోధ‌ప‌డి… ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే త‌ప్ప ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కి రూపురేఖ‌లు ఏర్పడే అవ‌కాశం లేద‌నేది స్ప‌ష్ట‌మైంది! అయితే, లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లుపెట్టిన కేసీఆర్‌… ఇప్పుడు మ‌రోసారి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి ప్రస్థావిస్తున్నారు. దాదాపు 150 మందిని జ‌మ‌చేశా అంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే… క‌నీసం సొంత రాష్ట్రమైన తెలంగాణ‌లోనైనా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ల‌క్ష్యాల ప్రాతిప‌దిక‌నే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళ్తున్నారా..? దేశ ప్ర‌యోజ‌నాల‌ దృక్కోణంలోనే ఫ్రెంట్ ఆవ‌శ్య‌క‌త‌ను తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్తున్నారా..? అంటే, లేద‌నేదే స‌మాధానం.

తెలంగాణ అభివృద్ధి మోడ‌ల్ దేశానికి అవ‌స‌ర‌మ‌ని కేసీఆర్ అంటుంటారు. అలాంప్పుడు, కేసీఆర్ చెబుతున్న‌ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అజెండానే ఇప్పుడు సొంత రాష్ట్రంలో ప్ర‌చారం చెయ్యాలి క‌దా! అసెంబ్లీ ఎన్నిక‌లూ అయిపోయాయి కాబ‌ట్టి… పూర్తిస్థాయి జాతీయ దృక్ప‌థంతో ఈ ఎన్నిక‌ల్ని కేసీఆర్ ఫేస్ చెయ్యాలి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ న‌మూనాని వివ‌రించి, ఫ‌లానా విధంగా తాను దేశాన్ని అభివృద్ధి చేద్దామ‌ని అనుకుంటున్నాన‌నీ… ఆ త‌ర‌హా మేనిఫెస్టోని తాను త‌యారు చేశాన‌ని కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. జాతీయ స్థాయిలో ఇత‌ర పార్టీల‌తో ఎలాగూ కామ‌న్ అజెండా కుద‌ర‌లేదు. కేసీఆర్ చెప్పిన ప్ర‌జ‌ల మేనిఫెస్టో సాధ్యం కాలేదు. అదేదో ఇప్పుడే త‌యారు చేసి, రాష్ట్రస్థాయిలోనైనా ప్ర‌జ‌ల‌కు వివ‌రించి, దానికి ఆమోదం పొందే ప్ర‌య‌త్నం కేసీఆర్ చెయ్యొచ్చు. తద్వారా జాతీయ రాజ‌కీయాల‌కు కేసీఆర్ ఎందుకు సంసిద్ధ‌మౌతున్నార‌నేది దేశానికి వివ‌రించొచ్చు.

కేంద్రంలో తెలంగాణ పెత్త‌నం కావాలి, కేంద్రం మెడ‌లు వంచాలి, కేంద్ర‌మే దిగొచ్చి తెలంగాణ‌కు నిధులివ్వాలి, ఢిల్లీలో తెరాస చ‌క్రం తిప్పాలి… ఇవే ల‌క్ష్యాల‌తో తెరాస ఎంపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలంటూ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ కోరుతున్నారు. ఈ ప్ర‌చారంలో జాతీయ స్థాయి దృక్ప‌థం ఎక్క‌డుంది..? దేశానికి కేసీఆర్ ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించే కోణం ఎక్క‌డుంది..? దేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా చూస్తూ, రెండు జాతీయ పార్టీలూ చేయ‌ని అభివృద్ధి న‌మూనాను కేసీఆర్ ఎక్క‌డ చూపుతున్న‌ట్టు..? తాను జాతీయ రాజ‌కీయాల‌కు వెళ్తానంటున్న‌ది తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోస‌మే త‌ప్ప‌, దీన్లో జాతీయ దృక్ప‌థం క‌నిపించ‌డం లేదు. సొంత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడ‌టం త‌ప్పు అని ఎవ‌రూ అన‌రు. కాక‌పోతే, దేశానికి త‌న‌ అవ‌సరం ఉంద‌ని చెప్పుకుంటున్న‌ప్పుడు… దేశం కూడా ఆయ‌న అవ‌స‌రాన్ని ఫీల్ అవ్వాలి క‌దా! మొత్తానికి, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కేసీఆర్ అవ‌స‌రంగా క‌నిపిస్తోందే త‌ప్ప‌, దేశానికి అవ‌స‌రంగా.. క‌నీసం తెలంగాణ ప్ర‌జ‌ల‌కైనా క‌నిపించాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close