ఐటెమ్ గీతాల‌కు నో…!

హీరోయిన్ పాత్ర‌ల‌కంటే వ్యాంపు త‌ర‌హా పాత్ర‌ల‌కు భ‌లే సెట్ట‌యిపోతుంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. `ఆర్‌.ఎక్స్ 100`లో కూడా ఆ పాత్ర ని దాదాపుగా అలానే డిజైన్ చేశాడు అజ‌య్ భూప‌తి. ఐటెమ్ గీతాల‌కు.. త‌ను మంచి ఆప్ష‌న్ కూడా. అందుకే `పుష్ష‌`, `భార‌తీయుడు 2` చిత్రాల‌లో పాయ‌ల్‌ని ఐటెమ్ గీతాల కోసం ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. పుష్ష సంగ‌తి ఎలా ఉన్నా – భార‌తీయుడు 2 లాంటి క్రేజీ ప్రాజెక్టులో పాయ‌ల్‌కి ఛాన్స్ రావ‌డం చూసి అంద‌రూ ఆశ్చర్య‌పోయారు. ఈ సినిమాతో పాయ‌ల్ ద‌శ తిరుగుతుంద‌ని భావించారు.

అయితే… ఈ వార్త‌ల‌పై ఇప్పుడు పాయ‌ల్ స్పందించింది. తాను ఏ సినిమాలోనూ, ఐటెమ్ గీతాలు చేయ‌డం లేద‌ని, అలాంటి ఆఫ‌ర్లు రాలేద‌ని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. భ‌విష్య‌త్తులోనూ ఐటెమ్ గీతాలు చేయ‌డానికి రెడీగా లేన‌ని, క‌థానాయిక‌గా మంచి పాత్ర‌ల కోసం చూస్తున్నాన‌ని చెప్పేసింది. ఇప్ప‌టికే త‌నపై వ్యాంపు, ఐటెమ్ గాళ్ ముద్ర ప‌డిపోయింది. వాటిని తొల‌గించుకోవాల‌ని పాయ‌ల్ ఇప్పుడు భావిస్తోంది. కాక‌పోతే.. త‌మ‌న్నా లాంటి స్టార్ హీరోయిన్లే ఐటెమ్ గీతాల‌కు సై అంటున్నారు. అలాంటి పాట‌ల‌తోనూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. క‌మ‌ల్‌, బ‌న్నీ సినిమాల్లో ఐటెమ్ గీతాల అవ‌కాశం రావ‌డం… చిన్న విష‌య‌మేం కాదు. కానీ.. పాయ‌ల్ మాత్రం అందుకు రెడీగా లేనంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close