నో కింగ్స్ పేరుతో అమెరికన్లు నిరసనలు నిర్వహిస్తున్నారు. లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాచరికం తరహాలో విధానాలు అమలు చేస్తూ తమ జీవితాలను బుగ్గి చేస్తున్నారని వారంతా తరుచుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. వీటికి రాను రాను ఆదరణ పెరుగుతోంది. పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వస్తున్నారు.
కానీ ఈ ఆందోళనలను ట్రంప్ కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా సెటైర్లు వేస్తున్నారు. ఎంత అంటే తాను కింగునేనని ఆయన ప్రచారం చేయించుకుంటున్నారు. కింగ్ వేషంలో ఆయన ఏఐ ఫోటోలను ట్రంప్ ప్రచార బృందం సోషల్ మీడియాలో పెట్టి నిరసనకారుల్ని మరింత రెచ్చగొడుతున్నారు. ట్రంప్ కూడా స్వయంగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. నిరసనలు చేస్తున్న వారిపై ఆయన విమానం ద్వారా బురద చల్లిన వీడియోను ఆయన తన ట్రూత్ లో పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారింది.
మరో వైపు ఈ ఆందోళలన్నీ అమెరికాకు వ్యతిరేకమని ట్రంప్ అభిమానులు అంటున్నారు. రాజులాగా ట్రంప్ బిహేవ్ చేయవద్దని ప్రజలు కోరుకుంటున్నారు కానీ.. ట్రంప్ అదే పని చేస్తున్నారని అంటున్నారు. సొంత ప్రజల వ్యతిరేకతను ట్రంప్.. పట్టించుకోవడంలేదు. తన మద్దతుదారులు తనకు ఉన్నారని ఆయన అనుకుంటున్నారు.