రాజధాని భూముల్లో ఎమ్మెన్సీలు కాదు ఉచిత ఇళ్లు..!

అమరావతిని ప్రభుత్వం చూసే విధానంలో మరో కోణం బయటకు వచ్చింది. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన భూముల్లో ప్రభుత్వానికి మిగిలే భూములను ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రెండు వేల ఎకరాలను.. పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ఉగాది నాటికి పాతిక లక్షల ఇళ్ల పట్టాలను ఉచితంగా ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వం భూముల కోసం.. తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. పాతిక లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వాలంటే.. రూ. 45వేల కోట్లు అవుతుందని అధికారులు లెక్క తీశారు. అలా కాకుండా.. ప్రభుత్వ భూములన్నింటినీ పంచడానికి ఏర్పాట్లు చేయాలని… ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రకారం.. ఓ రెండు వేల ఎకరాల భూములను.. పంచాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అమరావతి సీడ్ క్యాపిటల్ భూముల్లో ఉచిత ఇళ్ల పట్టాలు..!

అమరావతిని గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా చెబుతూ వచ్చింది. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి.. ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సినవి ఇవ్వగా.. మిగిలే భూములు ప్రభుత్వ ఆస్తిగా ఉంటుందని.. వాటి ద్వారా.. అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులు.. ఇతర అవసరాలు తీరడమే కాదు.. రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తిగా మారుతుందని చెబుతూ వస్తోంది. చేయాల్సిన అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఎకరం రూ. పది కోట్ల వరకూ పలుకుతుందన్న అంచనాలు.. ఉన్నాయి. ఇలా భూములను రూ. రెండు లక్షల కోట్ల విలువ చేసేదిగా అంచనా వేశారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం.. అమరావతి భూములను.. ఇళ్ల పట్టాలుగా చూస్తోంది. వాటికి అంతకు మించి విలువ లేనట్లుగా భావిస్తోంది. వాటిని ఉచితంగా పంచాలని నిర్ణయించుకుంది.

130 సంస్థలకు ఇచ్చిన భూములు వెనక్కి…!?

రాజధాని రైతులు.. తాము ఇచ్చిన పొలాల్లోకి అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు వస్తాయని.. అలా వస్తే.. తమ భూములకు మరింత విలువ పెరుగుతుందని అనుకున్నారు. గత ప్రభుత్వం కూడా.. దేశ, విదేశాలకు చెందిన 130 ప్రఖ్యాత సంస్థలకు భూములు కేటాయించింది. ఆ సంస్థలన్నీ.. అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే.. మెట్రో సిటీ లుక్ వచ్చేస్తుంది. నగరం నడిబొడ్డు ‌అవుతుంది. మాదాపూర్, జూబ్లిహిల్స్ , హైటెక్ సిటీ లాంటి ప్రైమ్ కమర్షియల్ ఏరియా అవుతుంది. కానీ అలాంటి అభివృద్ధిని ప్రభుత్వం చూడలేకపోతోంది. ప్రభుత్వం .. ఇప్పుడు వాటిల్లో ఉచిత ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది.

రాజధాని రైతుల్ని మరింతగా రెచ్చగొడుతున్నారా..?

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం.. అమరావతి రైతుల్ని మరింతగా రెచ్చగొట్టేలా ఉందన్న అభిప్రాయం… వ్యక్తమవుతోంది. తమ భూముల్ని తీసుకోవడమే కాదు.. అభివృద్ధి చేయకపోవడం.. రాజధాని తరలించేందుకు ప్రయత్నించడం మాత్రమే కాకుండా.. ఇప్పుడు ఆ భూముల్ని పంచుతామంటూ.. ప్రకటనలు చేయడం.. వారిని మరింత ఆగ్రహానికి గురి చేసే అవకాశం కనిపిస్తోంది. కక్ష సాధింపు చర్యల్లో ఇది పీక్ స్టేజి అని అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం.. ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దా..అని ఎదురుదాడి చేసి.. రెచ్చగొట్టే రాజకీయం చేయడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి .. పాలనలో.. నిర్ణయాల్లో తనదైన ముద్రవేస్తున్నారు. అవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close